Movie News

వీడియో: ఏడ్చేసిన విజ‌య్

అవును.. ద‌ళ‌ప‌తి విజ‌య్ ఏడ్చేశాడు. అవేమీ త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యం సాధించినందుకు వ‌చ్చిన ఆనంద భాష్పాలు కావు. త‌న కెరీర్ ఎదుగుద‌ల‌లో ఎంతో కీల‌క పాత్ర పోషించిన వ్య‌క్తి మ‌ర‌ణించిన బాధ‌తోనే విజ‌య్ ఏడ్చాడు. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఆర్.బి.చౌద‌రి.

తెలుగు, త‌మిళంలో ఎన్నో అద్భుత‌మైన సినిమాల‌ను నిర్మించిన చౌద‌రి.. మంగ‌ళ‌వారం హ‌ఠాత్తుగా క‌న్నుమూశారు. 83 ఏళ్ల వ‌య‌సులోనూ ఆరోగ్యంగా ఉన్న ఆయ‌న‌.. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

ఆయ‌న పార్థివ దేహాన్ని త‌మిళ సినీ ప్ర‌ముఖులంద‌రూ సంద‌ర్శించారు. ఎన్నిక‌ల్లో గెలిచాక ప్ర‌భుత్వ ఏర్పాటు సిద్ధ‌మ‌వుతూ.. చాలా హ‌డావుడిగా ఉన్న‌ప్ప‌టికీ విజ‌య్ వీలు చేసుకుని వ‌చ్చి ఆర్.బి.చౌద‌రికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

చౌద‌రి పార్థిక దేహానికి నివాళి అర్పించాక ఆయ‌న త‌న‌యుడు జీవాను హ‌త్తుకుని ఓదార్చిన విజ‌య్.. బోరును విల‌పిస్తున్న జీవాను చూసి, తానూ ఏడ్చేశారు. విజ‌య్ క‌న్నీళ్లు పెట్టుకున్న విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. విజ‌య్‌కి ఆర్.బి.చౌద‌రితో గొప్ప అనుబంధం ఉంది. 90వ ద‌శ‌కంలో హీరోగా ఓ మోస్త‌రు స్థాయిలో ఉన్న విజ‌య్ పెద్ద స్టార్‌గా ఎద‌గ‌డంలో చౌద‌రి పాత్ర కీల‌కం.

ఆయ‌న ప్రొడ్యూస్ చేసిన పూవె ఉన‌క్కాగ (తెలుగులో శుభాకాంక్ష‌లు), ల‌వ్ టుడే (సుస్వాగ‌తం), తుల్లాద‌మ‌నం తుల్లుం (నువ్వు వ‌స్తావ‌ని), ఉన‌క్కాగ ఎల్లాం ఉన‌క్కాగ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు అయి విజ‌య్ రేంజి మార్చేశాయి. ఆ కృత‌జ్ఞ‌త విజ‌య్ ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాడు.

చౌద‌రి మీద ప‌లు సంద‌ర్భాల్లో త‌న అభిమానాన్ని చాటిన విజ‌య్.. ఇప్పుడు ఎంతో హ‌డావుడిలో కూడా వ‌చ్చి ఆయ‌న పార్థివ దేహాన్ని సంద‌ర్శించారు. చౌద‌రి ఈ వ‌య‌సులోనూ సినిమాల నిర్మాణంలో యాక్టివ్‌గానే ఉంటూ వచ్చారు. గ‌త ఏడాది కూడా ఆయ‌న మారీశన్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారు.

This post was last modified on May 6, 2026 10:42 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

8 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago