Movie News

హిట్టు కోసం ఇద్దరు దర్శకులతో ఒకేసారి

టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్ స్ట్రీక్‌తో పతనం చవిచూసిన హీరో నితిన్. జయం, దిల్, సై చిత్రాలతో విపరీతమైన డిమాండ్ తెచ్చుకున్న అతను.. ఆ తర్వాత వరుసగా డజను ఫ్లాపులు ఖాతాలో వేసుకున్నాడు. ఇక తన పనైపోయిందని అనుకున్న టైంలో ‘ఇష్క్’ మూవీతో భలేగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఆపై గుండెజారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి హిట్లు ఇచ్చి ఒక దశ వరకు మంచి స్థాయిలోనే ఉన్నాడు. కానీ ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు హిట్టన్నదే లేదు. అరడజనుకు పైగా ఫ్లాపులు ఇచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను బాగా దెబ్బ తీసుకున్నాడు నితిన్. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ‘తమ్ముడు’ సినిమా పెట్టుబడిలో పావు వంతు కూడా వెనక్కి రాబట్టలేక నితిన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ అయింది.

దీంతో నితిన్ ఆలోచనలో పడ్డాడు. కొత్త సినిమా విషయంలో తొందరపడలేదు. ముందు అనుకున్న ప్రాజెక్టులను వదిలేశాడు. వేరే సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు.
ఎట్టకేలకు నితిన్ కొత్త సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పేరున్న సంస్థే నితిన్ కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది.

హిట్టు కోసం ఈసారి కొత్త దర్శకులను నమ్ముకున్నాడు నితిన్. అతడి తర్వాతి చిత్రానికి ఇద్దరు దర్శకులు పని చేయబోతుండడం విశేషం. వారి పేర్లు.. సోము-నర్రి. ఈ ఇద్దరూ కలిసి నితిన్ కోసం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేశారు. కొన్ని నెలల నుంచి కథ మీద కసరత్తులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు స్క్రిప్టు ఫైనలైజ్ అయింది.

నిర్మాత నాగవంశీ కూడా ఈ మధ్య వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. కింగ్డమ్, మాస్ జాతర, ఫంకీ చిత్రాలు ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇప్పుడు వంశీకి కూడా హిట్టు చాలా అవసరం. ఈ నేపథ్యంలో నితిన్, నాగవంశీ కూడా స్క్రిప్టు విషయంలో జాగ్రత్తగానే వ్యవహరించారని తెలుస్తోంది. బుధవారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ సినిమాలో ఇప్పటిదాకా చూడని కొత్త లుక్‌లో నితిన్ దర్శనమివ్వబోతున్నాడట.

This post was last modified on May 5, 2026 4:28 pm

Share

Recent Posts

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

1 hour ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

6 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

10 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

12 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

13 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

15 hours ago