టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేకపోయింది. నాని సినిమా ‘హిట్-3’నే ఉన్న వాటిలో కాస్త పెద్ద సినిమా. అది ఓ మోస్తరుగా ఆడింది. ‘హిట్-3’ కాకుండా మ్యాడ్ స్క్వేర్, సింగిల్ చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి. ఇటు పెద్ద సినిమాలు లేక, అటు వేరే చిత్రాల్లో కూడా చాలా వరకు తీవ్ర నిరాశకు మిగల్చడంతో 2025 సమ్మర్ సీజన్ వెలవెలబోయినట్లయింది.
ఐతే ఈసారైనా పరిస్థితి మారుతుందనుకుంటే.. ఇంకా ఘోరంగా తయారైంది. ఈ వేసవికి కూడా పెద్ద సినిమాల సందడి ఆశించిన స్థాయిలో లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక్కటే ఇప్పటిదాకా వచ్చిన పెద్ద సినిమా. అది అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటిదాకా వచ్చిన మిగతా సమ్మర్ సినిమాల్లో ‘డెకాయిట్’, ‘రాకాస’ ఒక మోస్తరుగా ఆడాయి. మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్లే.
గత వారం వచ్చిన ‘జెట్లీ’, ‘గాయపడ్డ సింహం’ ఎంతో ప్రామిసింగ్‌గా కనిపించాయి. కానీ ప్రోమోల్లో ఉన్నంత కంటెంట్.. సినిమాల్లో లేకపోవడంతో అవి బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. తమిళ అనువాద చిత్రం ‘కర’ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
ఈ వారం రానున్న గోదారి గట్టుపైన, రేజర్, సతీలీలావతి చిత్రాలకు కూడా ఆశించినంత బజ్ కనిపించడం లేదు. తర్వాతి వారాల్లో ఏ సినిమాలు వస్తాయో క్లారిటీ లేదు. మే 15కు అనుకున్న ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు డైలమాలో ఉంది. రాబోయే సినిమాల సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రేక్షకులు.
వేసవిలో ఇలాంటి పరిస్థితి ఉండడం ఆశ్చర్యం. మే సినిమాల మీద కూడా పెద్దగా ఆశల్లేని స్థితిలో జూన్ తొలి వారంలో రానున్న రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ మీదే అందరి దృష్టీ నిలిచి ఉంది. ట్రేడ్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆ సినిమా వచ్చాక చూసుకుందాం అన్నట్లు రిలాక్స్ అవుతున్నారు. మధ్యలో ఏదైనా సినిమా సర్ప్రైజ్ హిట్ అయితే చూస్తారేమో కానీ.. ఇప్పటికైతే ‘పెద్ది’ ఆశలతో సైలెంట్‌గా ఉంటున్నారు ప్రేక్షకులు.
This post was last modified on May 5, 2026 4:35 pm
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…