సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ టాక్ యావరేజ్ గా ఉంటే ప్రేక్షకులు వారం రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అనే ఆలోచనతో ఉంటున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో రాకూడదనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తోంది. కానీ లేటెస్ట్ గా జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్‌లో ఈ నిర్ణయంపై పెద్ద బ్యానర్లు సానుకూలంగా లేవనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
థియేటర్లకు జనం రావాలంటే గ్యాప్ పెంచక తప్పదని ఒకవైపు అంటున్నా, నిర్మాతలు మాత్రం మరో కోణంలో ఆలోచిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే, ఎనిమిది వారాల గ్యాప్ అంటే అది నిర్మాతల పాలిట రెండు అంచుల కత్తి లాంటిది. ఓటీటీ సంస్థలు సినిమా విడుదలకు ముందే భారీ రేటుకు అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. అయితే ఈ ఒప్పందంలో సినిమా థియేటర్లలోకి వచ్చిన ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అవుతుందనేది కీలకమైన పాయింట్.
ఒకవేళ ఎనిమిది వారాల నిబంధన పెడితే, ఓటీటీ సంస్థలు ఇచ్చే రేటును భారీగా తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల నిర్మాతలకు వచ్చే ఆదాయంలో కోత పడుతుంది. అందుకే ఆర్థిక లాభాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద బ్యానర్లు ఈ ప్రతిపాదనకు అంతగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు థియేటర్ల ఖర్చుల భయం కూడా నిర్మాతలను వెంటాడుతోంది. జనాలు కేవలం మొదటి వారం మాత్రమే థియేటర్లకు విపరీతంగా వస్తున్నారు. రెండో వారం నుంచి కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ఎనిమిది వారాల పాటు థియేటర్లలోనే ఉంచాలంటే, స్క్రీన్ రెంట్స్ ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపెడవుతాయి.
ఆడియన్స్ లేని థియేటర్లలో షోలు రన్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనేది నిర్మాతల వాదన. అందుకే థియేటర్ రన్ పెంచడం కంటే ఓటీటీ డీల్ ద్వారా త్వరగా సేఫ్ అవ్వడమే బెటర్ అని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గిల్డ్ చర్చల్లో పర్సంటేజీ విధానం గురించి కూడా ప్రస్తావన వచ్చినా, అది మరోసారి వాయిదా పడింది. రెంటల్ సిస్టమ్ వల్లే థియేటర్ల భారం పెరుగుతోందని నిర్మాతలు అంటుంటే, ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులు తాము చెబుతున్నారు. ఈ గొడవల మధ్య అసలు సమస్య అయిన ‘ఓటీటీ గ్యాప్’ పరిష్కారం కావడం లేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కంటెంట్ తో పాటు వారికి ఒక పక్కా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వ్యాపార లెక్కల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీకి ఒక పెద్ద సవాలుగా మారింది.
This post was last modified on May 5, 2026 12:54 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…