Political News

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని చూస్తే అదే అర్థమవుతుంది. చెన్నై కంటే వేగంగా హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అవగాహన చేసుకోవచ్చు. వీకెండ్ అయ్యేసరికి నంబరు ఏమైనా మారతాయేమో చూడాలి. మొన్నటికి మొన్న డిసి కూడా ఇదే తరహాలో మన దగ్గరే స్పీడ్ చూపించింది. దెబ్బకు లోకేష్ కనగరాజ్ ఆఘమేఘాల మీద థియేటర్ విజిట్స్ కు వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెప్పాడు.

కానీ సూర్య సినిమా విషయంలో జరుగుతున్న పరిణామమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక తెలుగు దర్శకుడు తీయడం వల్ల ఓన్ చేసుకోలేకపోతున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందాని విశ్లేషకులు అనాలిసిస్ చేసే పనిలో పడ్డారు. సింపుల్ గా చెప్పాలంటే కోలీవుడ్ ఆడియన్స్ సెన్సిబుల్ గా ఉండరు. మోటుతనం, పల్లెటూరి నేపథ్యం, హద్దులు దాటిన మెలోడ్రామాలు వాళ్లకు త్వరగా కనెక్ట్ అవుతాయి. విజయ్ వారసుడు సీరియల్ లా ఉన్నా ఆదరణ దక్కించుకోవడానికి కారణం ఇదే. దానికి విజయ్ స్టామినా కూడా దోహద పడింది కానీ అది వేరే విషయం.

మన దర్శకులు తీసే వాటిలో డ్రామా సున్నితంగా ఉంటుంది. ఓవర్ హైప్ లేదా శృతి మించడం ఉండదు. అందుకే సూర్య, రాధికా శరత్ కుమార్, మమిత బైజుల మధ్య సన్నివేశాలను చాలా మెచ్యూర్ గా చూపించారు వెంకీ అట్లూరి. మాములుగా అయితే ఎబెట్టుగా అనిపించాల్సిన కాండోమ్ ఎపిసోడ్ మాములుగా వెళ్లిపోయిందంటే వెంకీ హ్యాండిల్ చేసిన విధానం అంత కన్విన్సింగ్ గా ఉండటం వల్ల. ఇది తమిళ జనాల అభిరుచికి విరుద్ధంగా అనిపించే ఛాన్స్ ఉంది.

అలాని వాళ్ళను నెగటివ్ గా ఏమి అనడం లేదు. ఒక్కో చోట ఒక్కో అభిరుచి ఉంటుంది. మలయాళంలో బబుల్  గమ్ లా సాగదీసిన క్రైమ్ థ్రిల్లర్లు విపరీతంగా ఇష్టపడతారు. వాటిని మనం ఓటిటిలో చూడగలం కానీ థియేటర్లలో తట్టుకోలేం. లేచి వచ్చేస్తాం. అందుకే అవి ఎక్కువ శాతం డబ్బింగ్ కావు. అల వైకుంఠపురములో, అఆ లాంటివి మన దగ్గరే ఆడతాయి. తమిళంలో వర్కౌట్ కావు. గత ఏడాది కుబేర ఇక్కడ పాసయ్యింది కానీ ధనుష్ స్వంత రాష్ట్రంలో ఫ్లాప్ గా నిలిచింది. ఇలా ఉంటాయి డబ్బింగ్ ముచ్చట్లు. 

This post was last modified on August 15, 2026 4:11 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago