తమిళనాట స్టార్ హీరో జోసెఫ్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కగజం (టీవీకే) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు ఫలితాలను సాధించింది. అటు అధికార పార్టీ డీఎంకేతో పాటు ఇటు విపక్షం అన్నాడీఎంకేను కూడా ఓడించేసిన విజయ్ పార్టీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది.
తమిళ అసెంబ్లీలో మొత్తం సీట్లు 234 ఉండగా… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకి అయినా 118 సీట్లు ఉండాలి. అయితే మొన్నటి ఎన్నికల్లో విజయ్ పార్టీకి 108 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే… ఇంకో 10 సీట్లు సర్దుబాటు అయితే తప్పించి విజయ్ సీఎం పీఠం ఎక్కలేరు. వెరసి ఇప్పుడు తమిళనాట నెంబర్ గేమ్ రంజుగా నడుస్తోంది.
డీఎంకేకు తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతును తీసుకుంటే బాగుంటుందని విజయ్ సన్నిహితులతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తనను అధికారం నుంచి దించేసిన విజయ్ పార్టీకి ఎలా మద్దతు ఇస్తారంటూ కాంగ్రెస్ ను డీఎంకే అడ్డుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి ఎన్నికలు ముగియగానే… మిత్రధర్మాన్ని వదిలి ప్రత్యర్థి పార్టీకి ఎలా మద్దతు పలికేది అని కాంగ్రెస్ కూడా ఒకింత అంతర్మథనంలో పడిపోయిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంపై కాంగ్రెస్, డీఎంకేల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకేకు చెందిన దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు రెడీ అయిపోయారట. వీరంతా అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిసామికి తెలియకుండా మంగళవారం భేటీ అయ్యారట. తాజాగా బుధవారం వారంతా నేరుగా అన్నాడీఎంకే కార్యాలయంలోనే ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం.
ఇంతకాలం అధికారానికి దూరంగా ఉన్నాం… ఇప్పుడు విజయ్ కి మద్దతు ఇస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందవచ్చు కదా అన్నది వారి వాదనగా వినిపిస్తోంది. అన్నాడీఎంకే ఈ ఎన్నికల కంటే ముందు నుంచే బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి గెలిసిందే. విజయ్ కి మద్దతు విషయంలో తన ఎమ్మెల్యేలను పళనిసామి నిలువరించలేకపోతున్నట్లుగా సమాచారం.
మరోవైపు అయితే గియితే కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మద్దతు తీసుకోవడానికి విజయ్ పార్టీ ఓ మోస్తరు సిద్ధంగానే ఉన్నా… బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకే మద్దతు తీసుకోవడానికి మాత్రం సిద్ధం లేనట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే మద్దతు తీసుకుంటే…బీజేపీ మద్దతు తీసుకున్నట్లే కదా అన్న బావన విజయ్ పార్టీని ఈ విషయంలో పునరాలోచనలో పడేసినట్లుగా చెబుతున్నారు. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామన్నా… విజయ్ పార్టీ ఆ ప్రతిపాదన పట్ల ఇప్పటిదాకా స్పందించనేలేదు.
ఇక తమిళనాడులోని చిన్నా చితక పార్టీలన్నీ అటు డీఎంకేతోనో, లేదంటే ఇటు అన్నాడీఎంకేతోనో పొత్తులో ఉన్నాయి. వెరసి విజయ్ పార్టీకి మద్దతు కావాలంటే కాంగ్రెస్ కూటమి నుంచో లేదంటే బీజేపీ కూటమి నుంచో మాత్రమే మద్దతు దక్కాలి. అలా కాకుండా ఆయా కూటముల నుంచి బయటకు వచ్చేసి మరీ విజయ్ పార్టీకి మద్దతుగా నిలిచే పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి విజయ్ పార్టీ ముందు ఉన్న నెంబర్ గేమ్ ఏ రీతిన ముస్తుందన్నదానిపై ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకుంటూ సాగుతున్నారు.
This post was last modified on May 6, 2026 2:53 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…