జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల వచ్చే ఏడాది అయినప్పటికీ ఇప్పటికే వచ్చిన విపరీతమైన అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని స్పీడ్ పెంచారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాధ్యతలు ప్రస్థానం డైరెక్టర్ దేవ కట్టకు ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఇలాంటివి అధికారికంగా ప్రకటించరు కానీ అభిమానులు ఇది విని తెగ సంబరపడుతున్నారు.
ఎందుకంటే దేవ కట్ట పెన్ను చాలా పదును. ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ లో ఆయన డైరెక్షన్ కన్నా ఎక్కువగా రైటింగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకే రాజమౌళి ఏరికోరి వారణాసి కోసం ఆయనను తన టీమ్ లోకి తీసుకున్నారు. ఇప్పుడు నీల్ కూడా అదే చేస్తున్నారని టాక్. తెలుగు సినిమా కావడంతో సంభాషణల పరంగా మెరుపులు ఉండాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. అంతర్గత సమాచారం మేరకు చాలా పవర్ ఫుల్ మాటలు రాసినట్టుగా తెలుస్తోంది.
భారీ అంచనాలు మోస్తున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు. డ్రాగన్ అని ముందు నుంచి ప్రచారంలో ఉంది కానీ ప్రశాంత్ నీల్ నిర్ణయం కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడప్పుడే అర్జెంట్ ఏమి లేదు కాబట్టి నీల్ కూడా హడావిడి పడకుండా స్లోగా ఉన్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. రెండు భాగాలుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టోవినో థామస్ తప్పుకున్నాక తిరిగి ఎవరు ఆ పాత్ర చేస్తున్నారనే కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ ఇద్దరు ముగ్గురితో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ ఉంది కానీ ఫైనల్ ఎవరు అవుతారనేది ఇప్పటికి సస్పెన్సే. దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆశలన్నీ డ్రాగన్ మీదే ఉన్నాయి. తారక్ ని ఎప్పుడూ చూడని రెండు షేడ్స్ లో సరికొత్తగా ప్రెజెంట్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. దసరాకు టీజర్ వదిలే ఆలోచన చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates