లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి.. వయసు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గిపోయారు. తర్వాత విజయ్ రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటిస్తే.. ఇతను ఏమాత్రం ప్రభావం చూపుతాడులే అంటూ చాలామంది అతణ్ని తక్కువ చేసి మాట్లాడారు.
కానీ అలా మాట్లాడిన అందరికీ దిమ్మదిరిగే సమాధానం చెబుతున్నాడు విజయ్. ఈ సారి ఎన్నికల్లో విజయ్ మహా అయితే ‘కింగ్ మేకర్’ కావచ్చని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ అతను ఏకంగా ‘కింగ్’ అవుతున్నాడు. అధికారం చేపట్టడానికి అవససరమైన మెజారిటీ దిశగా టీవీకే అడుగులు వేస్తోంది.
నాలుగైదు స్థానాలు తగ్గినా.. వాటిని తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రాజకీయాల్లో ఫిలిం సెలబ్రెటీల ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం.
విజయ్ సాధిస్తున్న అద్భుత విజయం.. తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి విజయ్‌కి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో తెలిసిందే. కరూర్ ఘటనతో ఆరంభంలోనే పెద్ద బ్రేక్ పడింది.
ఆ తర్వాత ‘జననాయగన్’ రిలీజ్ ఆగిపోవడం, భార్యతో విడాకుల వివాదం, త్రిషతో బంధం గురించిన చర్చ.. ఇలా ప్రతిదీ విజయ్‌కి ప్రతికూలంగానే కనిపించింది. మరోవైపు విజయ్‌తో పొత్తు కోసం ఏఐడీఎంకే, బీజేపీ గట్టి ఒత్తిడి తెచ్చాయి. కానీ అతను ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదు. ఒంటరిగా ఎదురీదాడు. అద్భుత ఫలితాలు రాబట్టాడు. ఇది తారక్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
జూనియర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు లేవని, అతను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఎదురీదాల్సిందే అని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. తారక్ ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి, ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తే అతడికీ అవకాశాలు ఉంటాయనడానికి విజయ్ రాబట్టిన ఫలితాలే ఉదాహరణ. కాబట్టి కొంచెం టైం తీసుకుని అయినా, తారక్ రాజకీయాల్లోకి రావాల్సిందే అని తన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
This post was last modified on May 4, 2026 12:55 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…