Movie News

క్రియేటివిటీ ప్రోమోల‌కే ప‌రిమిత‌మా?

గ‌త శుక్ర‌వారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది క‌మెడియ‌న్ స‌త్య హీరోగా ప‌రిచయం అయిన సినిమా. అయినా స‌రే.. దానికి మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ‌వుతుందా అని ఒక వ‌ర్గం ప్రేక్ష‌కులు ఎదురు చూశారు. కొంద‌రు స్టార్ హీరోల సినిమాల‌ను మించి ఆ సినిమా ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ తీసుకురాగ‌లిగింది. దీనికి కార‌ణం.. సినిమా మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచి టీం చేసిన ప్ర‌చారం.

అనౌన్స్‌మెంట్ ద‌గ్గ‌ర్నుంచి రెగ్యుల‌ర్‌గా ఫ‌న్నీ ప్రోమోలు వ‌దులుతూ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించ‌గ‌లిగాడు ద‌ర్శ‌కుడు రితేష్ రాణా. మేకింగ్ టైంలో వ‌చ్చిన కొన్ని వీడియోలైతే ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించాయి. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లు కూడా భ‌లే స‌ర‌దాగా సాగాయి. స‌త్య ముందే రాసుకువ‌చ్చిన ఫ‌న్నీ స్పీచ్‌ల‌తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రితేష్ రాణా, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు కూడా అంతే ఎంట‌ర్టైన్ చేశారు. టీం చేసిన ఇంట‌ర్వ్యూలు కూడా భ‌లే ఎంట‌ర్టైన్ చేశాయి.

ఐతే ప్రోమోల్లో ఎంతో క్రియేటివిటీ చూపించి.. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసిన టీం.. సినిమాలో మాత్రం ఆ స్థాయి వినోదాన్ని పంచ‌లేక‌పోయింది. రితేష్ రాణా క్రియేటివిటీలో ఎక్కువ‌గా ప్రోమోల‌కే వాడేశాడా అన్న‌ట్లుగా సాగింది సినిమా. అక్క‌డ‌క్క‌డా కొన్ని సీన్ల‌లో త‌న సెన్సాఫ్ హ్యూమ‌ర్ క‌నిపించినా.. కొన్ని జోకులు బాగా పేలినా.. ఓవ‌రాల్‌గా సినిమా నిరాశ‌ప‌రిచింది. ముఖ్యంగా సెకండాఫ్ చ‌ప్ప‌గా సాగ‌డంతో ప్రేక్ష‌కుల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. గ‌త వారం రిలీజైన మ‌రో సినిమా గాయ‌ప‌డ్డ సింహం కూడా ప్రోమోల‌తో బాగానే ఆస‌క్తి రేకెత్తించ‌లిగింది. ట్రంప్ క్యారెక్ట‌ర్‌ను ఏఐలో క్రియేట్ చేసి.. దాంతో క‌లిసి త‌రుణ్ భాస్క‌ర్ చేసిన వీడియోలు భ‌లే ఫ‌న్నీగా అనిపించాయి. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ కూడా బాగా క‌ట్ చేశారు. ప్ర‌మోష‌న్లు కూడా గ‌ట్టిగా జ‌రిగాయి.

సినిమాకు మంచి బ‌జ్ క్రియేట్ అయింది. చిన్న సినిమాల్లో ఒక సంచ‌ల‌నం అవుతుందేమో అన్నంత హ‌డావుడి క‌నిపించింది రిలీజ్ ముంగిట‌. తీరా చూస్తే సినిమాలో అంత విష‌యం లేదు. జెట్లీ స్థాయిలో కూడా ఇందులో కామెడీ పండ‌లేదు. వినోదానికి స్కోప్ ఉన్న కాన్సెప్టే అయినా ద‌ర్శ‌కుడు ఉప‌యోగించుకోలేదు. ఈ రెండు చిత్రాలూ వీకెండ్ త‌ర్వాత ఏమాత్రం నిల‌బ‌డే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ప్రోమోలు చూస్తే ఆహా ఓహో అన్న‌ట్లుంటే.. సినిమాల్లో ఏమో స‌రిప‌డా విష‌యం లేక టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మ‌రో వీకెండ్ నిరాశే మిగిల్చింది.

This post was last modified on May 4, 2026 10:25 am

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

29 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

43 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

1 hour ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

2 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

2 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

3 hours ago