Movie News

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం ముందు రోజు జూన్ 3 సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా బెనిఫిట్ షోలు వేయబోతున్నారు. హిందీలో కూడా అదే సమయంలో స్క్రీనింగ్ చేసేందుకు ఉత్తరాదిలో పంపిణి చేస్తున్న జియో స్టూడియోస్ సుముఖంగా ఉండటంతో దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకునే పనిలో నిర్మాతలున్నారు. దురంధర్ తరహాలో వర్కౌట్ అవుతుందనేది ఉత్తరాది బయ్యర్ల ఆలోచన.

ప్రస్తుతం ఊపిరి సలపనంతగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు బుచ్చిబాబు వీలైనంత వేగంగా రెహమాన్ కు ఫైనల్ కాపీ ఇచ్చేసి రీ రికార్డింగ్ పూర్తి చేయించాలి. అక్కడితో ఒక పెద్ద బాధ్యత తీరిపోతుంది. ప్రమోషన్ల విషయానికి వస్తే కనీసం నాలుగు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ చేయాలనేది ప్రాథమికంగా ఉన్న ఆలోచన. హైదరాబాద్ తో పాటు కోచి, చెన్నై, బెంగళూరు, ముంబైలో వేడుకలు చేయడం ద్వారా నేషనల్ లెవెల్ బజ్ పెంచాలనేది అసలు ప్లాన్.

పెద్ది పట్ల బయ్యర్ వర్గాల ఎగ్జైట్ మెంట్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. మూడు నెలల నుంచి హౌస్ ఫుల్స్ లేక థియేటర్లు పెడుతున్న ఆకలి కేకలు మాములుగా లేవు. అవన్నీ పెద్ది తీరుస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 రేంజ్ లో రేట్లు పలుకుతున్నా ఎవరు వెనుకడుగు వేయడం లేదని ట్రేడ్ టాక్. ముఖ్యంగా సీడెడ్, గోదావరి జిల్లాల సైడ్ నుంచి వస్తున్న ధరల గురించి వింటే కలెక్షన్ల జాతర మాములుగా ఉండబోవడం లేదని అర్థమవుతోంది.

మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది చిరంజీవి సూపర్ హిట్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ డిజాస్టర్ వాళ్ళకు నిరాశ కలిగించింది. అందుకే పెద్ది దీన్ని బ్యాలన్స్ చేస్తుందని ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్ అసోసియేషన్స్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈసారి కనివిని ఎరుగని స్థాయిలో పెద్దికి స్వాగతం చెబుతారట. పాజిటివ్ వైబ్స్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఆ నమ్మకాన్ని కనక బుచ్చిబాబు నిలబెట్టుకుంటే నేరుగా టయర్ 1 డైరెక్టర్ల లిస్టులోకి వెళ్లపోతారు.

This post was last modified on May 3, 2026 7:30 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

16 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

24 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

39 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

40 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago