నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే 27 విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నారట. అయితే అంతకన్నా ముందే వచ్చే సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించమని పంపిణీదారులు చెప్పినట్టు సమాచారం. మే రెండు మూడు వారాల్లో విక్రమ్ ధృవ నచ్చతిరం, సూర్య వీరభద్రుడు విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.
ఒకవేళ జన నాయకుడు కనక త్వరగా వస్తా అంటే ఇవి తప్పుకోవాల్సి ఉంటుంది. కాకపోతే విక్రమ్, సూర్యలకు ఒక సమస్య ఉంది. జూన్ మొదటి వారానికి వెళ్ళిపోతే అక్కడేమో పెద్ది పొంచి ఉంది. తమిళనాడులో ఎలా ఉన్నా ఏపీ తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాన్ని తట్టుకుని కరుప్పు, ధృవ నచ్చతిరం నిలబడలేవు. అసలు జన నాయకుడు ఆ టైంలో వచ్చినా విజయ్ కే రిస్కు. అందుకే సేఫ్ గేమ్ గా జూన్ 27 అనుకుంటున్నారట.
అమెజాన్ ప్రైమ్ ఓటిటి డీల్ క్యాన్సిల్ చేసుకోవడంతో ఇప్పుడు జీ ఫైవ్ దాని స్థానంలో యాభై కోట్లకు ఓటిటి కొంటామని ఆఫర్ ఇచ్చినట్టు చెన్నై మీడియా టాక్. అంటే నిర్మాత అందుకోవాల్సిన మొత్తంలో డెబ్భై కోట్ల దాకా కోత పడుతుంది. దీనికి ముఖ్య కారణం పైరసీ. హెచ్డి క్వాలిటీతో ప్రింట్ ముందే లీకైపోవడం చాలా డ్యామేజ్ చేసింది. లింకులన్నీ తీయించే నాటికి లక్షల సంఖ్యలో జనాలు జన నాయకుడు చూసేశారు. సో ఇది రేట్ తగ్గడానికి మెయిన్ రీజన్.
విజయ్ ఇమేజ్ దృష్ట్యా ఓపెనింగ్స్ కి లోటు లేదు కానీ లాంగ్ రన్ ఏ మేరకు నిలబడుతుందనేది చూడాలి. తెలుగుతో సహా ఇతర భాషల్లో దీని మీద అంతగా బజ్ లేదు. భగవంత్ కేసరి రీమేకనే క్లారిటీ వచ్చేయడంతో మన ఆడియన్స్ ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ విజయ్ టీవీకె పార్టీ కనక విజయం సాధిస్తే ఇంకా ముందుగానే జన నాయకుడు థియేటర్లలో అడుగు పెట్టొచ్చు. లేదంటే మటుకు ఇంకొంత ట్రబుల్స్ తప్పవేమో. ఇంకో వారంలో సెన్సార్ లాంఛనం అయిపోతుందని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on May 3, 2026 9:01 am
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…