సమంత టైటిల్ రోల్ పోషించిన మా ఇంటి బంగారం మే 15 రావడం లేదని ఫిలిం నగర్ టాక్. వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారని, ఎండలు ఐపీఎల్ వల్ల జూన్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అధిక శాతం వ్యక్తం కావడంతో పునరాలోచనలో పడ్డారనే మాట వినిపిస్తోంది. ఇది నిజమో కాదో ఇంకా ఖరారుగా చెప్పలేదు కానీ హఠాత్తుగా సామ్ బృందం సైలెంట్ అయిపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికే ఒక వీడియో సాంగ్, వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ వచ్చేశాయి.
ఎలాగూ టాక్సిక్ తప్పుకుంది కాబట్టి జూన్ 4 మా ఇంటి బంగారంకి మంచి డేట్ అవుతుందని తొలుత మేకర్స్ భావించారు. అయితే జూన్ 25 అనుకున్న పెద్ది అనూహ్యంగా జూన్ 5కి షిఫ్ట్ కావడంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు సామ్ వీలైతే మే 15 లేదా ఒక వారం ఆలస్యానికి కట్టుబడాలి. లేదంటే జూన్ లాస్ట్ వీక్ కు వెళ్ళిపోవాలి. అంతకు మించి ఆప్షన్ కనిపించడం లేదు. ఈ సైలెన్స్ సమంత బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది.
దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఈ మూవీని తన కంబ్యాక్ కోసం అన్నంతగా కష్టపడుతున్నారు. ఇంతకు ముంచు చేసిన అన్నీ మంచి శకునములే దారుణంగా పోయింది. ఈ కారణంగా చేతి దాకా వచ్చిన సిద్దు జొన్నలగడ్డ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. మునుపటి ఫామ్ అందుకోవాలంటే మా ఇంటి బంగారంని సూపర్ హిట్ చేసి చూపించాలి. టీజర్, పాట గట్రా ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి.
ఇక సామ్ విషయానికి వస్తే శాకుంతలం డిజాస్టర్, ఖుషి యావరేజ్ ఫలితం తన స్పీడ్ కి అడ్డం పడ్డాయి. పైగా సిటాడెల్ హానీ అండ్ బన్నీ వెబ్ సిరీస్ కూడా ఆశించిన ఫలితం అందుకోలేదు. ఈ నేపథ్యంలో నిర్మాతగా నటిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్న సమంతకు ఇప్పుడు భర్త రాజ్ తోడయ్యారు. మా ఇంటి బంగారం ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. పెళ్లయ్యాక చేసిన మొదటి మూవీ కావడంతో ఈ జంట చాలా స్పెషల్ గా ఫీలవుతోంది.
This post was last modified on May 1, 2026 4:39 pm
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం మాట ఎలా ఉన్నా.. నాయకులను బలోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ పరిచేందుకు…