ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు ఫెయిలవుతున్నారు. ఏదో ఒక రూపంలో బయటికి వచ్చేసి ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ తగ్గిస్తోంది. గత ఏడాది హిట్ 3 ది థర్డ్ కేస్ విషయంలో ఇదే జరిగింది. చాలా గుట్టుగా మైంటైన్ చేసిన కార్తీ క్యారెక్టర్ రెండు మూడు వారాల ముందే లీక్ కావడంతో క్లైమాక్స్ లో దక్కాల్సిన థ్రిల్ చప్పగా మారిపోయింది. దర్శకుడు శైలేష్ చాలా ఫీలయ్యాడు.
అయితే బాలీవుడ్ ఇలాంటివి బాగానే హ్యాండిల్ చేస్తోంది. తాజాగా విడుదలైన రాజా శివాజీలో సల్మాన్ ఖాన్ ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియకుండా దాచి పెట్టారు. చేసింది చిన్న క్యామియోనే అయినా స్క్రీన్ మీద చాలా బాగా వచ్చింది. అందులోనూ హీరో కం దర్శకుడు రితేష్ దేశముఖ్ పోషించిన శివాజీ క్యారెక్టర్ కు ఎలివేషన్ ఇస్తూ డైలాగులు చెప్పడంతో థియేటర్లలో క్లాప్స్ విజిల్స్ పడుతున్నాయి. మాములుగా ఇలాంటి చారిత్రక పాత్రలకు సల్మాన్ ఖాన్ దూరంగా ఉంటాడు.
కానీ రితేష్, జెనీలియా పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడంతో ఓకే చెప్పాడు. ఇప్పుడు సల్మాన్ తాలూకు క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ మంచి ఊపులో ఉన్న బుకింగ్స్ కు ఇది చాలా హెల్ప్ అవుతుంది. గంటకు సగటున పదమూడు వేలకు పైగా టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోతున్నాయి. ఈ నెంబర్ వీకెండ్ కి రెట్టింపు అవుతుందని బయ్యర్లు భావిస్తున్నారు. ప్రీమియర్ల నుంచి రిపోర్ట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి.
గతంలో దర్శకుడిగా మజిలీ రీమేక్ వేద్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రితేష్ దేశముఖ్ ఈసారి పెద్ద క్యాస్టింగ్ తో రాజా శివాజీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. అభిషేక్ బచ్చన్, విద్య బాలన్, సంజయ్ దత్ తో పాటు ఎప్పుడో యాక్టింగ్ మానేసిన ఫర్దీన్ ఖాన్ ని దీని కోసం ఒప్పించారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆకర్షణ తోడయ్యింది. శివాజి మహారాజ్ నమ్మిన బంటు జివ మహాల పాత్రలో సల్మాన్ ఖాన్ ని చూస్తుంటే ఇదే ఫుల్ లెన్త్ రోల్ తో విడిగా సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on May 1, 2026 12:34 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…