Trends

హోటళ్లకు బండ బాదుడే

దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై నీలి నీడలు కమ్ముకోగా… యుద్ధం జరుగుతున్నా… గ్యాస్ లభ్యతకు వచ్చిన ఇబ్బందేమీ లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటింటించాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు గ్యాస్ కష్టాలు మొదలు అయ్యాయి. అయితే ఈ కష్టాలు గృహ వినియోగాన్ని తాకకున్నా… వాణిజ్య గ్యాస్ వినియోగాన్ని ఓ రేంజిలో ప్రభావితం చేయనుంది. వాణిజ్య గ్యాస్ రేట్లను కేంద్రం బారీగా పెంచడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. వెరసి దేశవ్యాప్తంగా హోటళ్లలో గ్యాస్ బండ బాదుడు గట్టిగానే వినిపించనుంది.

దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచుతూ కేంద్రం శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన రేట్లు శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయని కూడా కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. అంటే…శుక్రవారం ఉదయం నుంచి పెరిగిన గ్యాస్ ధరలను ఆయా గ్యాస్ కంపెనీలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తాయన్న మాట. వాణిజ్య వినియోగానికి సంబంధించి గ్యాస్ కంపెనీలు 19 కేజీల సిలిండర్లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిలిండర్ల రేట్లను కేంద్రం ఒకేసారి భారీగా పెంచేసింది.

ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేటు రూ.2078.50గా ఉంది. ఈ రేటును కేంద్రం ఒకేసారి ఏకంగా రూ.993 మేర పెంచింది. అంటే… శుక్రవారం నుంచి 19 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు ఏకంగా రూ.3,071.50క చేరుతుంది. అంటే ఒకేసారి ఈ రేటును కేంద్రం 50 శాతం మేర పెంచిందన్న మాట. 50 శాతం మేర గ్యాస్ రేటును కేంద్రం పెంచితే… ఆ మేర వాణిజ్య సముదాయాలు… ప్రత్యేకించి జనంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న హోటళ్లు తమ రేట్లను కూడా 50 శాతం మేర పెంచడం ఖాయంగానే కనిపిస్తోంది. వెరసి హోటళ్లలో గ్యాస్ బండ బాదుడు ఓ రేంజిలో వినిపించనుందని చెప్పక తప్పదు.

This post was last modified on May 1, 2026 11:39 am

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

9 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago