Movie News

సుకుమార్ ఎంత సమయం తీసుకుంటారో

కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి తెలిసిందే. రంగస్థలం కాంబో కావడంతో షూటింగ్ స్టార్ట్ కాక ముందే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. స్క్రిప్ట్ ఆల్రెడీ లాకైపోయింది. ఇటీవలే ఫైనల్ నెరేషన్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. జూన్ నుంచి ప్రారంభిస్తామని మైత్రి సిఈఓ చెర్రీ తాజాగా విడుదలైన జెట్లీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పేశారు. సరే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కదా.

శిష్యుడు బుచ్చిబాబు పెద్దిని అనుకున్న టైంకి పూర్తి చేయలేకపోయాడు. మూడు వాయిదాలు పడిన తర్వాత ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. అది కూడా అంత ఈజీగా నమ్మలేని స్థితిలో ఫ్యాన్స్ ఉన్నారు. పర్ఫెక్షన్ కోసం ఇలాంటివి తప్పవని సర్దిచెప్పుకున్నా టయర్ 1 స్టార్లు ఒక్కో ప్రాజెక్టు మీద రెండు మూడు సంవత్సరాలు ఖర్చు పెట్టడం థియేటర్ వ్యవస్థని దెబ్బ తీస్తోంది. ఏడాదిలో నాలుగు నెలలు పచ్చగా ఉంటే మిగిలిన ఎనిమిది నెలలు ఈగలు తోలాల్సి వస్తోంది.

ఇప్పుడు గురువు వంతు వస్తోంది. పుష్ప 1 ది రైజ్, పుష్ప 2 ది రూల్ కు ఎంత టైం తీసుకున్నారో మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. చివరి నిమిషం దాకా క్వాలిటీ కోసం తపన పడటం సుకుమార్ స్టయిల్. రంగస్థలంకు కూడా చివరి స్టేజిలో జాప్యం జరిగింది. పుష్పకి అది పూర్తిగా పెరిగిపోయింది. ఇప్పుడు చరణ్ తో మూవీ అంటే ఇంకెంత చేస్తారో అనే అనుమానం రావడం సహజం. 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. 2028 సంక్రాంతికి వస్తే బాగుంటుంది.

గేమ్ చేంజర్, ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ చాలా విలువైన కాలాన్ని కర్పూరంలా కరిగించేశాడు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతున్నా ఇంకా కెరీర్ లో ఇరవై సినిమాలు పూర్తి కాలేదు. సుకుమార్ ది 17 నెంబర్. చిరంజీవి లాగా 150కి పైగా సినిమాలు చరణ్ చేయాలని కోరుకోవడం లేదు కానీ కనీసం హాఫ్ సెంచరీ అయినా కావాలని ఫ్యాన్స్ ఆకాంక్ష. సరే అది ఫ్యూచర్ సంగతి కానీ ఆర్సి 17 కోసం సుకుమార్ ఎంత టైం తీసుకుంటానేది మాత్రం ఇప్పట్లో సమాధానం దొరకని ప్రశ్న.

This post was last modified on May 1, 2026 12:04 am

Share

Recent Posts

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

54 minutes ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

1 hour ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

2 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

2 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

3 hours ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

4 hours ago