అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే సోషల్ మీడియాలో ఒక వర్గం అలెర్టయిపోతుంది. కామెడీ పేరుతో క్రింజ్ చేస్తున్నాడని కొందరు, టీవీ సీరియల్ లా అనిపించే విజువల్స్ తో స్టార్ హీరోలను ఇలానా ప్రెజెంట్ చేయడమంటూ ఇంకొందరు ఇలా రెగ్యులర్ గా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. మన శంకరవరప్రసాద్ ట్రైలర్ కు వచ్చిన నెగిటివిటీని ఒక్క హుక్ స్టెప్ పాటతో పోగొట్టి ఒక్క రాత్రిలోనే ఓవర్సీస్ బుకింగ్స్ అమాంతం పెరిగేలా చేయడం అనిల్ కే చెల్లింది. ఇలా జరగడం మొదటిసారి కాదు.
సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టు పాట మొదటిసారి వచ్చినప్పుడు క్రిటిసిజం చూశాం. కట్ చేస్తే ఓపెనింగ్స్ రావడానికి అదొక పెద్ద పునాదిగా నిలిచింది. తాజాగా జనవరి 12 విడుదల నుంచి మొదటి సాంగ్ డివిక్కి డివిక్కి విడుదల చేశారు అనిల్ రావిపూడి. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ రెగ్యులర్ స్టయిల్ కి భిన్నంగా ఊరమాస్ స్టయిల్ లో ఒక అమ్మాయి, ఆమె వదిన కలిసి పాడుకునే పండగ పాటలా కంపోజ్ చేయించారు. కీర్తి సురేష్, కృతి శెట్టి స్టెప్పులు హుషారు ప్లస్ గ్లామర్ కలగలిసి ఉన్నాయి.
ఎప్పటిలాగే దీని మీద పోస్ట్ మార్టం మొదలైపోయింది. పాత కామెంట్లు మళ్ళీ ఊపందుకున్నాయి. ఇవి ఎన్ని వచ్చినా జనవరి 12 విడుదల హైప్ కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు హీరోయిన్లతో మొదలుపెట్టాడు కానీ నెక్స్ట్ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో ఇంకో అదిరిపోయే పాట చేయించే ఉంటాడు. సో దేన్నీ తక్కువంచనా వేయడానికి లేదు. ఫీడ్ బ్యాక్ సంగతి పక్కనపెడితే ఈ డివిక్కి డివిక్కి కొన్ని వారాల పాటు ఇన్స్ టా రీల్స్ లో మోతెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పోలిక కోణంలో చూసుకుంటే గోదారి గట్టుపైన, మీసాల పిల్లకు సరిజోడిగా అనిపించకపోవచ్చు కానీ థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద చూశాక అభిప్రాయాల్లో మరింత మార్పు రావొచ్చు. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్న జనవరి 12 విడుదలకు ఆల్రెడీ బిజినెస్ డీల్స్ అయిపోతున్నాయి. నైజామ్ కు చాలా పెద్ద రేట్ ఇచ్చి ఎస్విసి సంస్థ కొనుగోలు చేసింది. థియేటర్ అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. డిసెంబర్ రెండో వారం నుంచి పబ్లిసిటీని ఉదృతం చేయబోతున్నారు.
This post was last modified on November 21, 2026 5:44 pm
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా.. శనివారం సీనియర్ నాయకుడు, దివంగత పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం…
బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య వివాదం ముదిరి పాకానపడినట్లు…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ మీద అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
దేనికైనా హద్దు, అదుపు ఉంటుంది. రాజకీయాలు వేరు, వ్యక్తిగత బంధాలు వేరు. రెంటిని కలిపి చూడటం మూర్ఖులు చేసే పని…
అవసరమైనప్పుడు భారత్‌ను ప్రశంసించడం.. ప్రయోజనాల విషయంలో మాత్రం భారతీయులకు ఆంక్షలు విధించడం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిలో కనిపిస్తున్న…
ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ మోస్ట్ పాపులర్ క్రికెటర్ అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు.…