Movie News

విక్రమ్ కోసం సూర్య త్యాగం చేస్తాడా

పదమూడేళ్ల క్రితం ప్రకటించిన సినిమా ధృవ నచ్చతిరం. విక్రమ్ హీరోగా, పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా, గౌతమ్ మీనన్ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా పూర్తయి పదేళ్లు దాటుతున్నా ఆర్థిక కారణాల వల్ల ఇంకా ల్యాబ్ నుంచి బయటికి రాలేదు. వ్యవహారం కోర్టు దాకా వెళ్లి తాజాగా జూన్ 15 లోపు రిలీజ్ చేయాలనే ఉత్తర్వులు రావడంతో విక్రమ్ ఫ్యాన్స్ హమ్మయ్యా అనుకుంటున్నారు. ఇక్కడ సూర్య ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.

ధృవ నచ్చతిరంని మేలోనే రిలీజ్ చేయాలనేది గౌతమ్ మీనన్ ప్లాన్. కానీ మే 14 సూర్య వీరభద్రుడు (కరుప్పు) ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ చేసుకుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వాయిదా వేయాల్సి వస్తే మే 22 షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కొత్త ప్రమోషన్ పోస్టర్లలో రిలీజ్ డేట్ తీసేశారు. కరుప్పు నిర్మాతలతో సంప్రదింపులు జరిపి ధృవ నచ్చతిరంకు పోటీ లేకుండా చూసే విధంగా గౌతమ్ మీనన్ అడుగులు వేస్తున్నారని చెన్నై టాక్.

అసలు కరుప్పునే విపరీతమైన వాయిదాల వల్ల ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఇప్పుడు విక్రమ్ కోసం సూర్య త్యాగం చేయాల్సి వస్తే ఒక రిస్క్ పొంచి ఉంది. జూన్ 4 పెద్ది వస్తున్న నేపథ్యంలో దానికి దగ్గరలో క్లాష్ అవ్వడం తెలుగు రాష్ట్రాల వరకు అంత సేఫ్ అనిపించుకోదు. పైగా కర్ణాటకలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాని బదులు మే 14కే కట్టుబడితే బాగుంటుందనేది డిస్ట్రిబ్యూటర్ల సలహా. ఇంకా ఏదీ తేలలేదు.

ఇంకో ట్విస్టు ఏంటంటే ధృవ నచ్చతిరం సింగల్ పార్ట్ కాదు. రెండు భాగాలు వస్తాయట. బిజినెస్ పరంగా ఇది ప్లస్ అవుతుంది కానీ ఒకవేళ మొదటి భాగం ఫెయిల్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చిన ఈ యాక్షన్ మూవీలో ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్తిబన్, రాధికా శరత్ కుమార్, అర్జున్ దాస్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఇంతకీ మే 14 విక్రమ్, సూర్యలో ఎవరో ఒకరు వస్తారో రారో చూడాలి. అన్నట్టు సమంత మా ఇంటి బంగారం కూడా మే 15 నుంచి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందట.

This post was last modified on April 30, 2026 7:29 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

8 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

10 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

10 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

10 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

14 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

14 hours ago