Movie News

రెహమాన్ భయ్యానే బరువు తగ్గించాలి

పెద్ది విడుదల తేదీ డిస్కషన్లు ఎడతెగడం లేదు. జూన్ 4 పక్కా అని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు, అభిమాన సంఘాల మధ్య చర్చ జరుగుతుండగా నిర్మాతల వైపు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రావడం లేదు. ఈసారి తొందరపడకూడదనే ఉద్దేశంతో కొత్త పోస్టర్ రెడీ అయినా సరే వదలకుండా సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు సోషల్ మీడియాలో హ్యాండిల్స్ జూన్ 4 ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బుచ్చిబాబుని నేరుగా అడిగితే సమాధానం చెప్పడం లేదట.

ఇప్పుడు అందరి చూపు ఏఆర్ రెహమాన్ మీదకు వెళ్తోంది. ఎందుకంటే కీలకమైన రీ రికార్డింగ్ కి ఎంత సమయం అడుగుతారో అనే టెన్షన్ యూనిట్ లోనే కాదు ఫ్యాన్స్ లోనూ ఉంది. బెస్ట్ ఇవ్వాలంటే తగినంత టైం డిమాండ్ చేసే రెహమాన్ హడావిడి పడటం చాలా అరుదు. ఒకవేళ రిలీజ్ డేట్ ఒత్తిడి, నిర్మాణ సంస్థ బిజినెస్ వ్యవహారాలు లాంటివి తీవ్రంగా ఉంటే స్పీడ్ పెంచుతారు కానీ తన నుంచి మంచి స్కోర్ ఆశిస్తే మాత్రం ప్రెజర్ చేయకూడదనేది రెహమాన్ సిద్ధాంతం.

బుచ్చిబాబు మీద రెహమాన్ కు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. పెద్ది కథను చెప్పిన విధానం, తనని ఒప్పించడం స్పెషల్ గా చూస్తున్నారు. సో ఇలాంటి కంటెంట్ కి న్యాయం చేయాలనే భావన ఆయనలోనూ ఉంది. రెండు పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా చికిరి చికిరి ఏకంగా బిజినెస్ రేంజ్ పెంచింది. రైరై రారాలో రామ్ చరణ్ డాన్సులు డామినేట్ చేశాయి కానీ దానికి రెహమాన్ ఇచ్చిన ట్యూన్ మాములు మాస్ కాదు.

ఇంకో రెండు పాటలు రావాలి. ప్రస్తుతం లిరికల్ వీడియోస్ రెడీ అవుతున్నాయి. బీజీఎమ్ ఫలానా తేదీ లోపు ఇస్తానని రెహమాన్ నుంచి హామీ వస్తే చాలు జూన్ 4 పోస్టర్ బయటికి వస్తుందని ఇన్ సైడ్ టాక్. ఆయన ప్రస్తుతం పెద్ది ఒక్కదాని మీదే పని చేయడం లేదు. రామాయణ పార్ట్ 1 వర్క్ జరుగుతోంది. ప్రభుదేవా మూన్ వాక్, రవి మోహన్ జీనీ, ఇంతియాజ్ అలీ బాలీవుడ్ మూవీ, సన్నీ డియోల్ లాహోర్ 1947 పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. సో సమస్య ఏంటో అర్థమయ్యిందిగా.

This post was last modified on April 30, 2026 6:15 pm

Share

Recent Posts

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

19 minutes ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

4 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

4 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

6 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

7 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

7 hours ago