Movie News

సమ్మర్ సీజన్లో సత్య సత్తాకు పరీక్ష

కమెడియన్ సత్య హీరోగా రూపొందిన జెట్లీ రేపు విడుదలకు రెడీ అయిపోయింది. ప్రమోషన్ల పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ఇక తీర్పు చెప్పాల్సింది ప్రేక్షకులే. ఇప్పటిదాకా చాలా సినిమాల్లో బలమైన హాస్య పాత్రలతో తన ఉనికిని చాటుకున్న సత్య మత్తువదలరా లాంటి మూవీస్ తో ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు సోలో హీరోగా బాధ్యత మొత్తం తన భుజాల మీద వేసుకుని వెరైటీ యాక్షన్ థ్రిల్లర్ తో జనాల ముందుకు రాబోతున్నాడు.

ఒకవేళ జెట్లీ కనక హిట్ టాక్ తెచ్చుకుంటే సత్య జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. డెకాయిట్ తర్వాత ఇంకేదీ కనీస స్థాయిలో పబ్లిక్ ని ఆకట్టుకోలేదు. దీంతో వేస్తున్న షోల కన్నా క్యాన్సిల్ అవుతున్నవి రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయి. ఇది ప్రతి సెంటర్ లో కనిపిస్తున్న దృశ్యం. జెట్లీతో పాటు వస్తున్న గాయపడ్డ సింహం ఈ అవకాశాన్ని వాడుకోవడం గురించి బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

గతంలో కమెడియన్లు హీరోగా బ్లాక్ బస్టర్స్ సాధించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలీని పెట్టి ఎస్వి కృష్ణారెడ్డి యమలీల ప్రకటించినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కట్ చేస్తే 1994 ఏప్రిల్ నెలలో నాగార్జున హలో బ్రదర్, బాలకృష్ణ భైరవ ద్వీపం, రాజశేఖర్ అన్న లాంటి సూపర్ హిట్స్ పోటీని తట్టుకుని యమలీల అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. జెట్లీ ఆ స్థాయిలో ఉంటుందని చెప్పడం లేదు కానీ కంటెంట్ ఉంటే ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.

సునీల్ కూడా సోలో హీరోగా మంచి కెరీర్ చూశాడు. తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఇప్పుడు జెట్లీతో సత్య కేవలం హీరోగా నటిస్తాడని కాదు కానీ మార్కెట్, ఇమేజ్ రెండూ పెరిగే ఛాన్స్ అయితే వాడుకోవాలి. గాయపడ్డ సింహంని మినహాయిస్తే పోటీలో ఉన్న డబ్బింగ్ సినిమాల ప్రభావం అంతంత మాత్రంగా ఉండటం జెట్లీ క్యాష్ చేసుకోవాలి. ముఖ్యంగా వీకెండ్ దాకా సాలిడ్ గా నిలబడితే చాలు వేగంగా బ్రేక్ ఈవెన్ అందుకుకోవచ్చు. చూడాలి మరి ఏం చేస్తాడో.

This post was last modified on April 30, 2026 9:11 pm

Share

Recent Posts

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

35 minutes ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

1 hour ago

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

3 hours ago

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

3 hours ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

5 hours ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

8 hours ago