Movie News

దురంధర్ కాంబో రిపీట్ కానుందా

ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన దర్శకుడు ఆదిత్య ధార్. దురంధర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజైనప్పుడు అసలిది ఆడుతుందాని సవాలక్ష అనుమానాలు కలిగాయి. ముందు రోజు ప్లాన్ చేసిన ప్రీమియర్ షో క్యాన్సిల్ చేయడంతో అవి మరింత బలపడ్డాయి. దీనికి తోడు ట్రైలర్ మీద నెగటివిటీ. కట్ చేస్తే ఎవరూ కలలో కూడా ఊహించని స్థాయిలో దురంధర్ వసూళ్ల భీభత్సం చేసింది.

కేవలం మూడు నెలల గ్యాప్ లో వచ్చిన సెకండ్ పార్ట్ దురంధర్ ది రివెంజ్ నేనేం తీసిపోలేదు అనే రేంజ్ లో ఏకంగా బాహుబలి 2, పుష్ప 2 రికార్డులకు ఎసరు పెట్టింది. ఇప్పుడు నెమ్మదించింది కానీ 40 రోజుల తర్వాత కూడా బుక్ మై షోలో ట్రెండింగ్ ఉండటం అనేది మాములు విషయం కాదు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ తర్వాత అంత ప్రామిసింగ్ డైరెక్టర్ గా ఆదిత్య ధార్ కేవలం మూడు సినిమాలతోనే పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు అందరి చూపు తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడనే దాని మీద ఉంది. ముంబై మీడియా ప్రకారం ఆదిత్య ధార్ ప్రస్తుతం ఒక లైన్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది 2027 మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టేలా ప్రణాళిక వేసుకుంటున్నారట. టాలీవుడ్ ఫ్యాన్స్ ఊహించుకుంటున్నట్టు అది రామ్ చరణ్, అల్లు అర్జున్ లేదా ప్రభాస్ తోనో కాదు. తనను రెండుసార్లు నమ్మిన రణ్వీర్ సింగ్ కే ఓటు వేయొచ్చని అంటున్నారు. స్క్రిప్ట్ లాకయ్యాకే క్యాస్టింగ్ తెలుస్తుంది.

ఏ టైంలో స్టార్ట్ అవుతుందనేది పక్కనపెడితే అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే దాని మీద అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఆదిత్య ధార్ కోసం ఇండియా వైడ్ టాప్ స్టార్స్ అందరూ ఎప్పుడెప్పుడు పని చేద్దామాని ఎదురు చూస్తున్నారు. కానీ అతను అంత ఈజీగా దొరికిపోయి రకం కాదు. యురి ది సర్జికల్ స్ట్రైక్, దురంధర్, దురంధర్ ది రివెంజ్ తర్వాత సినిమా అంటే ఆ మూడింటిని మించి ఉండాలి. సబ్జెక్ట్, స్కేల్, బడ్జెట్ ఏదైనా సరే. ఆదిత్య ధార్ టార్గెట్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే.

This post was last modified on April 28, 2026 9:08 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago