Movie News

వంద బరువులు మోస్తున్న నాగార్జున

అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ కి ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం అభిమానుల్లో ఆశ్చర్యం, అనుమానం రెండూ కలిగించాయి. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేకపోవడం వల్లే. ఇటీవలే ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్ర పోషించిన మేడ్ ఇన్ కొరియా ఈయన డైరెక్షన్ లోనే నేరుగా నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి రిలీజ్ జరుపుకుంది. ఆశించిన స్థాయిలో భారీ స్పందన రాలేదు. మిక్స్డ్ టాక్ వచ్చింది.

అలాంటి కార్తీక్ కి నాగార్జున ఛాన్స్ ఇచ్చారంటే విశేషమే. సినిమా పరంగా నాగార్జున మీద ఓ వంద బరువులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూలీ, కుబేరలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయడం వల్ల ఆయనకు కెరీర్ పరంగా ఏమి ప్లస్ కాలేదు. పైగా రజనీకాంత్ చేతిలో చనిపోయే పాత్రను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. సో వాళ్ళను చల్లార్చాలి. బంగార్రాజు తర్వాత నాగ్ అసలు మాస్ సబ్జెక్టు ట్రై చేయలేదు. ఆ లోటు తీవ్రంగా ఉంది. దాన్ని పూడ్చాలి.

ఇందులో నాగార్జున డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో కనిపిస్తారని సమాచారం. అంటే పాతికేళ్ల యువకుడి నుంచి యాభై వయసు వచ్చే న్యూ ఏజ్ డాన్ గా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్ అయినప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం షాకింగ్ అనిపిస్తుందని యూనిట్ టాక్. లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. రిజిస్టర్ చేసి ఉంచారని వినికిడి. త్వరలోనే ప్రకటన ఇచ్చే అవకాశముంది.

నిన్నే పెళ్లాడతా వచ్చిన ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత టబు నాగార్జున సినిమాలో నటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద కూడా పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. విడుదల గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ కనక 2027 సంక్రాంతికి వచ్చే పనైతే నాగ్ 100 దసరా లేదా దీపావళిని టార్గెట్ చేసుకోవాలి. ఇంకా బోలెడు టైం ఉంది కాబట్టి హడావిడి అవసరం లేదు కానీ ఒక బేసిక్ క్లారిటీ ఉండటం మంచిదే.

This post was last modified on April 28, 2026 6:20 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

27 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

34 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

38 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

59 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago