Movie News

రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల భారం కూడా ఒక్కరే మోస్తున్నారు. అల్లరితో హీరో నరేష్ కో ఇంటి పేరు ఇచ్చిన రవిబాబు ఆ తర్వాత అనసూయ, అమరావతి లాంటి థ్రిల్లర్ మూవీస్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా పూర్ణ లీడ్ రోల్ చేసిన అవును చాలా పాపులారిటీ తెచ్చింది. తర్వాత వరస ఫ్లాపులు రవిబాబుకి కొంత గ్యాప్ వచ్చేలా చేశాయి. ఇప్పుడు రేజర్ తో కంబ్యాక్ అవుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు కొన్ని హాట్ టాపిక్ గా మారాయి. మనకున్న హీరోల్లో తొంభై శాతం మంది డూపులతోనే మేనేజ్ చేశారని, అందుకే తన రేజర్ లో మధ్య వయసు ఉన్న పర్ఫెక్ట్ ఛాయస్ కోసం వెతికితే తనలా ఫిజిక్, కష్టపడే తత్వం ఎవరిలో కనిపించకపోవడం వల్లే నేనే హీరోగా చేశానని అన్నారు. నాలా నటించే వాళ్ళు కూడా దొరకలేదు అన్నారు. సరే అందులో కొంత లాజిక్ ఉన్నా పూర్తిగా ఏకీభవించలేని పాయింట్స్ కొన్ని ఉన్నాయి.

హీరోలకు డూప్ వాడటం అనేది ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జమానా నుంచి మహేష్ బాబు దాకా అందరూ చేసేదే. కాకపోతే సీన్ డిమాండ్ చేస్తే దాన్ని వద్దని మరీ రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. గూండా ట్రైన్ ఎపిసోడ్ కోసం చిరంజీవి ఎంత రిస్క్ చేశారో ఇప్పటికీ కథలుగా చెబుతారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహెష్ బాబు వీళ్ళందరూ కూడా సందర్భానుసారం డూప్స్ అవసరం లేకుండా కష్టపడిన వాళ్లే.

కాకపోతే ప్రతిసారి డూప్స్ లేకుండా చేయలేరు. ముందైతే దర్శక నిర్మాతలే వద్దంటారు. వందల కోట్ల పెట్టుబడులతో సినిమా తీస్తున్నప్పుడు హీరో ప్రాణాలను రిస్క్ చేయలేరు. డూపులు ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు కాబట్టి వాళ్ల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలు అంత అలవోకగా చేయలేరు కాబట్టి సహాయం అవసరం అవుతుంది. అన్ని చోట్ల టామ్ క్రూజ్ లు ఉండరు కదా. అడ్జస్ట్ అవ్వాల్సిందే.

This post was last modified on April 29, 2026 9:39 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago