ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్ పాత్ర కూడా సంచలనమే. అలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేసి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. గ్లామర్‌తోనే కాక పెర్ఫామెన్స్‌తోనూ పాయల్ ఎంతో ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాత అవకాశాలకు లోటు లేకపోయింది కానీ.. ఆశించిన విజయాలైతే అందుకోలేదు పాయల్. మధ్యలో వచ్చిన మంగళవారం మినహాయిస్తే తన కెరీర్లో సక్సెస్‌లు లేవు.
అయినా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది పాయల్. తాజాగా ఆమె 01.01.01 అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్‌కు హాజరైన పాయల్‌కు కాస్త ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురైంది. తన కెరీర్లో ఒడుదొడుకులు.. ఆరోగ్య సమస్యలు.. విపాసన అనే యోగా ప్రక్రియ ప్రయత్నించడం గురించి ఒక రిపోర్ట్ ఆమెను ప్రశ్నించాడు. దీనికి బదులిస్తూ పాయల్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయిన ఆమె.. ఒక దశ తర్వాత మాట్లాడలేక ప్రెస్ మీట్ నుంచే వెళ్లిపోయింది.
తాను విపాసన ప్రక్రియ ప్రయత్నించడానికి కారణమేంటో ఆమె వివరించింది. తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని.. తనకు అన్నీ ఆయనే అని.. ఆ సమయంలో తన తల్లిని ఎలా ఓదార్చాలో, తనను తాను ఎలా ఓదార్చుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యానని పాయల్ గుర్తు చేసుకుంది. ఆ విపత్కర పరిస్థితుల్లోనే తాను కుదుటపడేందుకు, మానసిక ఒత్తిడిని జయించేందుకు విపాసన ప్రక్రియను అనుసరించినట్లు పాయల్ వెల్లడించింది.
ఇక తన తండ్రి తనకెలా సపోర్ట్ చేసేవారో గుర్తు చేసుకుంటూ.. తన ప్రతి సినిమాకూ ఆయనే క్రిటిక్ అని చెప్పింది.
ఆర్ఎక్స్ 100 సినిమాలో తనది బోల్డ్ క్యారెక్టర్ అయినప్పటికీ, దాని గురించి తాను కామెంట్ చేయనని చెబుతూ అందులో తన పెర్ఫామెన్స్ గురించి తండ్రి ఎలా కొనియాడాడో చెప్పుకొచ్చింది పాయల్.
గత ఏడాది జులైలో తాను నటించిన ఒక పంజాబీ సినిమా విడుదలైందని.. కానీ అదే రోజు తన తండ్రి మరణించారని.. ఆ సినిమాను కూడా స్క్రీన్ మీద చూడాలని ఉందని చెప్పిన ఆయన రిలీజ్ రోజే కన్నుమూశారని.. ఆయన లేకుండా దాదాపు ఏడాది గడిచిపోయిందని చెబుతూ పాయల్ కన్నీటి పర్యంతం అయింది. పక్కనున్న వాళ్లు ఆమెకు మంచి నీళ్లు అందిస్తూ, ఓదార్చే ప్రయత్నం చేయగా.. తాను బాగానే ఉన్నానంటూ ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది పాయల్.
కానీ కన్నీళ్లను ఆపుకోవడం తన వల్ల కాకపోవడంతో చివరికి ఆమె స్టేజ్ దిగి ఏడ్చుకుంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో చిత్ర బృందం.. ఈవెంట్‌ను అక్కడితో ముగించేసింది. ఐతే పాయల్ కన్నీళ్లు పెట్టుకోవడంతో సినిమా ఈవెంట్లలో జర్నలిస్టులు ఆడిగే ప్రశ్నల విషయంలో మరోసారి చర్చ మొదలైంది. సినీ నటులు కూడా మనుషులే, వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోనూ ఎన్నో బాధలు ఉంటాయన్న సంగతి అర్థం చేసుకోకుండా లైన్ దాటి ఇలా ప్రశ్నలు అడగడమేంటి అంటూ ఫిలిం జర్నలిస్టుల మీద నెటిజన్లు మండిపడుతున్నారు.
This post was last modified on April 28, 2026 10:21 pm
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…