Movie News

ఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలా

జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా చాలా మంచి పేరు సంపాదించింది హైద‌రాబాద్ అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. లోక‌ల్ హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌ని తెలుగు సినిమ‌ల్లో ఫ‌రియా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆమె.. ఆ త‌ర్వాతు ఇప్ప‌టిదాకా రెండంకెల సంఖ్య‌లో సినిమాలు చేసింది. ఈ శుక్ర‌వారం రాబోయే రెండు చిత్రాల్లోనూ ఆమెది కీల‌క పాత్ర‌.

గాయ‌ప‌డ్డ సింహం సినిమాలో ఓ కీల‌క పాత్ర చేసిన ఆమె.. జెట్లీ మూవీలో క‌థానాయిక పాత్ర‌కు గాత్ర‌దానం చేసింది. మే ఫ‌స్ట్ వీకెండ్ మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఫరియా.. మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది. ఈ సంద‌ర్భంగా ఒక ఇంట‌ర్వ్యూలో త‌న కుటుంబం గురించి ఆసక్తికరమైన విష‌యాలు వెల్ల‌డించింది ఫ‌రియా. ఫ‌రియా అబ్దుల్లా అనే పేరు విన‌గానే ఆమె ముస్లిం అని అర్థ‌మ‌వుతుంది.

కానీ ఫ‌రియా తండ్రి పుట్టుకతో ముస్లిం కాద‌ట‌. ఆయ‌న హిందూ కుటుంబంలోనే పుట్టార‌ట‌. కానీ 30 ఏళ్ల వ‌య‌సులో ఇస్లాం మ‌తం ఆయ‌న దృష్టిని ఆక‌ర్షించింద‌ని.. అందులోని ప్ర‌శాంతత‌, ప‌ద్ధ‌తులు, దైవ‌చింత‌న‌.. ఇత‌ర అంశాలు న‌చ్చి ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించార‌ట ఫ‌రియా తండ్రి. ఇంకో విశేషం ఏంటంటే.. ఫ‌రియా త‌ల్లి సైతం ఇలాగే మ‌తం మారింద‌ట‌.

కానీ ఫ‌రియా తండ్రికి ఆమె రివ‌ర్స‌ట‌. స్వ‌త‌హాగా ఆమె ముస్లిం కాగా.. హిందూ మ‌తం న‌చ్చి అందులోకి మారింద‌ట. ఆమెకు హిందూ మ‌తంలోని ప‌ద్ధ‌తులు, ఆచారాలు, దైవ‌చింత‌న‌, ధ్యానం లాంటివి ఎంతో న‌చ్చి ఇటువైపు వ‌చ్చిన‌ట్లు ఫ‌రియా వెల్ల‌డించింది. త‌మ కుటుంబంలో మ‌తాల మ‌ధ్య తేడా ఉండ‌ద‌ని.. అన్ని మ‌తాలనూ గౌర‌విస్తార‌ని, ప్రేమిస్తార‌ని.. ప్రతి మ‌తంలో ఉన్న మంచినే తీసుకుంటార‌ని ఫ‌రియా చెప్పింది.

మ‌తాల్లోని మంచిని స్వీక‌రించి, మాన‌వ‌త్వంతో బ‌త‌క‌డ‌మే మంచిద‌నే విష‌యాన్ని త‌ల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న‌ట్లు ఫ‌రియా తెలిపింది. ఒక‌రితో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకునే క్ర‌మంలో కంఫ‌ర్ట్ కోసం భాగ‌స్వామి మ‌తం మార‌డం చూస్తుంటాం కానీ.. ఇలా ప‌ర‌స్ప‌రం ఒక‌రి మ‌తంలోకి ఒక‌రు మార‌డం మాత్రం అరుదైన విష‌య‌మే.

This post was last modified on April 28, 2026 9:35 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago