దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ ఒక్కసారిగా మారిపోవడం మామూలే. ముఖ్యంగా ‘బాహుబలి’ నుంచి జక్కన్న హీరోల ఇమేజ్‌ను శిఖర స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తున్నాడు. ‘బాహుబలి’తో ప్రభాస్ ఎంత పెద్ద సూపర్ స్టార్‌గా అవతరించాడో తెలిసిందే. తర్వాత వరుస డిజాస్టర్లు ఎదురైనా ప్రభాస్ ఇమేజ్ ఏమీ తగ్గిపోలేదు. ఇప్పటికీ వందల కోట్ల బడ్జెట్లలో భారీ చిత్రాలు చేస్తున్నాడు. తన సినిమాల లెక్కలన్నీ వేరుగా ఉంటున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల మార్కెట్ పరిధి కూడా విస్తరించింది. కాకపోతే రాజమౌళితో సినిమా చేస్తే తర్వాత పెరిగే అంచనాలను అందుకునేలా సినిమాలు చేయడమే ఆయా హీరోలకు కొంచెం కష్టమవుతోంది. కానీ వారి రీచ్, మార్కెట్ మాత్రం ఎంతగానో పెరుగుతాయన్నది మాత్రం వాస్తవం.
ఇప్పుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా అవతరిస్తాడని.. గ్లోబల్ లెవెల్లో తనకు పెద్ద మార్కెట్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.
‘వారణాసి’ కోసం మహేష్ బాబు మూడేళ్ల సమయం వెచ్చిస్తున్నాడు. అందులో షూటింగ్ కంటే ముందు ప్రిపరేషన్‌కే ఏడాదిన్నర దాకా సమయం పట్టింది. ఏడాది కిందట్నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు సూపర్ స్టార్. ఈ ఆగస్టుకల్లా ఈ సినిమాలో మహేష్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. మళ్లీ రిలీజ్ ముంగిట మహేష్ లెంగ్తీ ప్రమోషనల్ షెడ్యూల్ ఉంటుంది. ఐతే ఈ సినిమా రిలీజయ్యే వరకు ఎదురు చూడకుండా ముందే ఒక సినిమాను మొదలుపెట్టేయాలని మహేష్ చూస్తున్నాడు.
‘వారణాసి’ తర్వాత తనతో సినిమా చేసే అద్భుత అవకాశాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు మహేష్ ఇస్తున్నట్లు సమాచారం. ఆ సంస్థకు కమిట్మెంట్ ఇచ్చి కథ, దర్శకుడిని చూడమని చెప్పాడట. మైత్రీ వాళ్లు ఆల్రెడీ ఆ వేటలోనే ఉన్నారు. మరి టాలీవుడ్లో ఈ గోల్డెన్ ఛాన్స్ అందుకునే దర్శకుడు ఎవరు అన్నది ఆసక్తికరం. ఆ సమయానికి ఏ అగ్ర దర్శకుడూ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. సుకుమార్.. చరణ్ సినిమా పనిలో ఉన్నారు.
త్రివిక్రమ్‌కు ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టు ఉంది. దాన్ని లేటుగా చేేద్దామనుకున్నా సరే.. ఆయన ‘హారిక అండ్ హాసినిలో తప్ప వేరే బేనర్లలో సినిమాలు చేయరు. కొరటాల శివ.. బాలయ్య సినిమాతో బిజీ. నాగ్ అశ్విన్ పూర్తిగా ‘కల్కి-2’లో నిమగ్నమై ఉన్నాడు. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లతో సినిమాలు చేసిన సుజీత్‌కు బ్లడీ రోమియో, ఓజీ-2 కమిట్మెంట్లు ఉన్నాయి.
మరి మహేష్‌తో జట్టు కట్టే గోల్డెన్ ఛాన్స్ ఎవరు అందుకుంటారన్నది ఆసక్తికరం. ‘పెద్ది’తో హిట్ కొడితే బుచ్చిబాబు సానాకు ఛాన్స్ దక్కొచ్చు. లేదంటే మైత్రీ వాళ్లు ఎవరైనా పరభాషా దర్శకుడిని తీసుకురావాల్సిందే.
This post was last modified on April 28, 2026 2:14 pm
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…