Movie News

ఊరించడమేనా… నిజంగా సీక్వెల్ చేస్తారా?

ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేయడం కష్టమే అయినప్పటికీ.. ఫిలిం మేకర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులోనూ గత దశాబ్ద కాలంలో ఈ ట్రెండు బాగా ఊపందుకుంది. ఐతే అనౌన్స్ చేసిన సీక్వెల్స్ అన్నీ సెట్స్ మీదికి వెళ్తాయనే గ్యారెంటీ ఉండదు. వేరే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సీక్వెల్స్ గురించి ఊరించడం కూడా ఇప్పుడొక ట్రెండుగా మారింది.

ఆమిర్ ఖాన్ కూడా ఈ బాటలోనే సాగుతున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ వస్తుందనే ప్రచారం ఇప్పటిది కాదు. ఇటు ఆమిర్, అటు దర్శకుడు రాజ్ కుమార్ హిరాని ఈ విషయంలో ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఎంతకీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఐతే తాజాగా ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్టు విషయంలో క్యూరియాసిటీ పెంచే మాటలు మాట్లాడాడు.

ఐతే కొన్ని నెలల కిందట హిరాని తాను ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆమిర్ ఈ సినిమా గురించి స్పందించాడు. తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. ‘3 ఇడియట్స్’ స్క్రిప్టును తాను చదివానని.. అది అద్భుతంగా వచ్చిందని, ఆ కథ రొటీన్‌కు భిన్నంగా ఉంటుందని చెప్పాడు.

ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ‘3 ఇడియట్స్’లోని మిత్రులు ముగ్గురూ పదేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని.. ఒరిజినల్లోనే ఫన్, ఎమోషనల్ యాంగిల్ సీక్వెల్‌లోనూ కొనసాగుతాయని.. ‘3 ఇడియట్స్’లోని బేసిక్ థీమ్ తీసుకుని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను హిరాని నడిపించబోతున్నారని ఆమిర్ చెప్పాడు.

ఆయన మాటలు సీక్వెల్ మీద క్యూరియాసిటీని పెంచేలాగే ఉన్నాయి. కాకపోత హిరాని ఇంతకుముందు ‘మున్నాబాయ్-3’ గురించి ఊరించి తర్వాత ఉస్సూరుమనిపించాడు. మరి ఈ సీక్వెల్ విషయంలో అలా కాకుండా నిజంగానే సినిమాను ముందుకు తీసుకెళ్తే ‘3 ఇడియట్స్’ లవర్స్‌కు అంతకంటే శుభవార్త ఇంకొకటి ఉండదు.

This post was last modified on April 28, 2026 2:16 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

13 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago