రవితేజ అనగానే మాస్ అనే మాట గుర్తుకు వస్తుంది. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు చాలా వరకు మాస్ సినిమాలే. అందుకే ఆయన పేరు ముందు మాస్ మహారాజా, మాస్ రాజా అనే బిరుదులు వచ్చి చేరాయి. మధ్య మధ్యలో కొన్ని క్లాస్ సినిమాలు ట్రై చేసినా అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ఎప్పట్లాగే మాస్ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయాడు రవితేజ.
కానీ కొన్నేళ్ల నుంచి ఆ మాస్ సినిమాలు కూడా తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. గత ఏడాది మాస్ జాతర సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దీంతో రవితేజ రూటు మార్చక తప్పలేదు. తన ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టి సినిమాలు చేయడానికి ఆయన సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే కిషోర్ తిరుమలతో భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ మూవీ చేశాడు. రవితేజ నుంచి ఫ్యాన్స్ ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేదు. అది ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. అయినా రవితేజ డిఫరెంట్ రూట్లోనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం డివైన్ కథ ఇరుముడి పూర్తవ్వగానే ఈసారి హాసిత్ గోలి లాంటి న్యూ ఏజ్ దర్శకుడితో రవితేజ జట్టు కడుతున్నాడు. రాజరాజ చోర లాంటి హిట్ ఫిలింతో దర్శకుడిగా పరిచయం అయిన హాసిత్.. తర్వాత శ్వాగ్ తీశాడు. రెండో చిత్రం అంతగా ఆడకపోయినా.. అందులో సరికొత్తగా సాగిన కథాకథనాలు హాసిత్ ప్రత్యేకతను చాటాయి. ఇప్పుడతను రవితేజ లాంటి స్టార్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు.
అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి అక్కాయిలు బాగున్నారా అనే టైటిల్ అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ టీం ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. సినిమాను మాత్రం కన్ఫమ్ చేసింది.
అక్కాయిలు బాగున్నారా అనే టైటిల్ మరీ క్లాస్‌గా ఉంటుంది కాబట్టి వేరే పేరేదైనా ఆలోచిస్తుండొచ్చు. రాజు నిర్మాణంలో భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చేశాడు రవితేజ. ఇప్పుడు రవితేజకు హిట్ ఎంతో అవసరమైన టైంలో ఆయనతో జట్టు కడుతున్నాడు. మరి హాసిత్.. రవితేజతో ఒక డిఫరెంట్ మూవీ తీసి హిట్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on April 28, 2026 11:42 am
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…