Movie News

బుల్లితెరపై దేవర దర్శనం ఇంకెప్పుడు?

టయర్ 1 స్టార్ హీరోల సినిమాలకు ఓటిటి, శాటిలైట్, ఆడియో, డబ్బింగ్ హక్కులు హాట్ కేక్ లాంటివి. కొన్ని కోట్లు అటు ఇటు అయినా ఫైనల్ గా డీల్స్ అయితే జరిగిపోతాయి. ఆ మధ్య రాజా సాబ్ విషయంలో మేము అనుకున్న రేట్ రాకపోయినా చెప్పుకోదగ్గ మొత్తమే అందింది కాబట్టి రాజీ పడ్డామని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఒక్కోసారి కాంప్రోమైజ్ కాకపోతే ఉన్నది పాయే, గూట్లో దాచుకున్నది పోయే తరహాలో అయిపోతుంది.

కానీ దేవర కేసు చాలా విచిత్రంగా ఉంది. బాక్సాఫీస్ వసూళ్లలో ఇది బ్లాక్ బస్టర్. నెట్ ఫ్లిక్స్ లో వచ్చినపుడు వారాల తరబడి ట్రెండింగ్ లో ఉంది. కానీ ఇప్పటిదాకా శాటిలైట్ అమ్మకం జరగలేదు. దేవర థియేటర్లలో విడుదలై అక్షరాల 578 రోజులు అయ్యింది. ఇంత గ్యాప్ లో ఏనాడూ బుల్లితెర ప్రసారం జరగలేదు. తర్వాత వచ్చిన వార్ 2 నెక్స్ట్ వీక్ ప్రసారం కానుండగా, దేవర కన్నా ముందు చేసిన ఆర్ఆర్ఆర్ సైతం మూడు నెలలు దాటగానే టీవీ ఛానల్ లో వచ్చింది.

ఎంత ఓటిటిలో ఉన్నా టీవీ ఛానల్స్ లో వచ్చినప్పుడు చూసే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు లేనివాళ్లు, ఓటిటి జోలికి వెళ్లని ఆడియన్స్ ఈ క్యాటగిరీ కిందకు వస్తారు. ఇప్పటికీ కొత్త సినిమాలు పది నుంచి పదహారు దాకా టిఆర్పి రేటింగ్స్ తెచ్చుకోవడానికి కారణం ఇదే. దేవరకు ఆ ఛాన్స్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్, భారీ ప్రొడక్షన్, అనిరుద్ సంగీతం, కొరటాల దర్శకత్వం వెరసి మంచి స్పందన దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.

గతంలో ఇలాంటి డిలేస్ కొన్ని సినిమాలకు జరిగాయి. బాలకృష్ణ పరమవీరచక్ర ఇప్పటిదాకా బుల్లితెర ప్రసారానికి నోచుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావొచ్చు కానీ తర్వాత కనీసం ఒక్కసారైనా టీవీలో చూద్దాం అనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. కారణాలు ఏమైనా దేవర లాంటి హిట్ మూవీస్ ఇలా టీవీకి దూరం కావడం ఫ్యాన్స్ ని బాధించేదే. సూపర్ ప్లాప్ అయినా వార్ 2 వచ్చినప్పుడు రికార్డులు సృష్టించిన దేవర ఎందుకు రాలేదనే ప్రశ్నకు నిర్మాతలే సమాధానం చెప్పాలి.

This post was last modified on April 27, 2026 5:55 pm

Share

Recent Posts

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

24 minutes ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

4 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

4 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

4 hours ago

రాకా రికార్డులు అప్పుడే మొదలైపోయాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా విడుదల చాలా దూరంలో ఉండగానే రికార్డుల వేట…

5 hours ago

‘లస్ట్’ కథలు ఈసారి బెస్ట్ కాలేదా

కామం కాన్సెప్ట్ మీద తీసిన వెబ్ సిరీస్ గా లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ కు విపరీతమైన ఆదరణ దక్కింది.…

7 hours ago