Movie News

మే ఒకటి… కిరీటం ఎవరి చేతికి

డెకాయిట్ డీసెంట్ రన్ మినహాయించి ఏప్రిల్ లో ఎలాంటి అద్భుతాలు జరగలేదు. బైకర్, రాకాసలు జస్ట్ ఓకే అనిపించుకోగా తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తీక్ లాంటి స్ట్రెయిట్ సినిమాలు, వాలా 2 లాంటి డబ్బింగ్ చిత్రాలు అన్నీ పోయాయి. ఇప్పుడు మే వస్తోంది. సమ్మర్ లో కీలకమైన నెల ఇది. అన్ని సవ్యంగా జరిగి ఉంటే పెద్దితో థియేటర్లలో అరాచకం జరిగేది. కానీ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇప్పుడీ నెలలో మొదటి రోజే మంచి సందడి నెలకొననుంది.

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘గాయపడ్డ సింహం’ మీద మెల్లగా బజ్ పెరుగుతోంది. ఎన్నడూ లేనిది జెడి చక్రవర్తి ప్రమోషన్ల భారాన్ని తన భుజం మీద వేసుకుని మోస్తున్నాడు. చాలా బాగా వచ్చిందని దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. కమెడియన్ సత్య హీరోగా రూపొందిన ‘జెట్లీ’ మూవీ మైత్రి నిర్మాణం కావడంతో పబ్లిసిటీ పరంగా బాగానే సౌండ్ చేస్తోంది. ఈ రెండు సినిమాలకు కింది స్థాయి సెంటర్లలో వసూళ్లు రావాలంటే టాక్ చాలా కీలకం.

వీటిని కాసేపు పక్కనపెడితే మమ్ముట్టి మోహన్ లాల్ మల్టీస్టారర్ ‘పాట్రియాట్’ తెలుగు డబ్బింగ్ రావడం అనుమానమే. ఇప్పటికీ ఒరిజినల్ వెర్షన్ సెన్సార్ సర్టిఫికెటే చేతికి రాలేదని కేరళ మీడియా టాక్. సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ‘ఏక్ దిన్’ హిందీలో ఏదో ప్రమోషన్లు చేస్తోంది కానీ తెలుగులో సౌండ్ లేదు. ట్రైలర్ అనువదించి గతంలోనే విడుదల చేశారు రితేష్ దేశ్ ముఖ్ ‘రాజా శివాజీ’ టార్గెట్ మరాఠి మార్కెట్లే అయినా ఇతర రాష్ట్రాల ఆడియన్స్ ని కూడా మెప్పిస్తామనే ధీమా టీమ్ లో ఉంది.

థియేటర్ల దగ్గర సరైన సినిమాలు లేక వ్యాక్యూమ్ ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు దాన్ని వాడుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గాయపడ్డ సింహం, జెట్లీకు టాక్, రివ్యూస్ చాలా కీలకం. సోషల్ మీడియా మద్దతు ఒకటే సరిపోదు. సామాన్య ప్రేక్షకులు బాగుందని మెచ్చుకోవాలి. అప్పుడే రెండో రోజు నుంచి పికప్ చూడవచ్చు. వేసవిలో స్టార్ హీరోలు లేకపోవడం బాక్సాఫీస్ కు శాపంగా మారింది. దాన్ని వరంగా వాడుకునేలా మీడియం బడ్జెట్ సినిమాలు రాకపోవడమే అసలు లోటు.

This post was last modified on April 27, 2026 5:52 pm

Share

Recent Posts

ప్యారడైజ్ కథా నేపథ్యం తెలుసా?

ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ది ప్యారడైజ్’ మూవీ. ముందు రోజు సాయంత్రమే పెయిడ్ ప్రిమియర్స్ కూడా…

2 hours ago

తెలంగాణ యాసపై ట్రోల్స్… ర‌ష్మిక రియాక్ష‌న్

సోష‌ల్ మీడియా జ‌నాలు దేనికి ఎప్పుడు ట్రిగ్గ‌ర్ అవుతారో తెలియ‌దు. ఎవ‌రి మ‌నోభావాలు ఎందుకు, ఎలా దెబ్బ తింటాయో అర్థం…

3 hours ago

ఏపీ మంత్రుల‌పై తెలంగాణ మంత్రుల ఆగ్ర‌హం…?

కేంద్రంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒక‌రు పౌర విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, మ‌రొక‌రు…

3 hours ago

స్విగ్గీ డెలివరీతో 53 లక్షలు ఎలాగబ్బా?

డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ ఏకంగా రూ.53 లక్షలు సంపాదించాడు చెన్నైకి చెందిన శంకర్. అవును.. మీరు విన్నది నిజమే. ఎనిమిదేళ్లుగా…

3 hours ago

రక్తంతో తడిసిన మైసా… ర‌ష్మిక విస్ఫోట‌నం

https://youtu.be/SORZsU6Ytp4?si=bI3U08bsMtwlX-Oz కెరీర్లో ఎన్నో ర‌కాల పాత్ర‌లు చేసిప్ప‌టికీ.. ఇంకా ర‌ష్మిక మంద‌న్నా అంటే ఒక‌ క్యూట్ అమ్మాయిగానే జ‌నాల‌కు గుర్తుకొస్తుంది.…

14 hours ago

నాని జడల లుక్… అందరూ వద్దే వద్దన్నా

టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…

19 hours ago