ఒక నెల ముందు వరకు మెగా అభిమానులకు దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ఇష్టుడిగా ఉండేవాడు. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు తిరుగులేని హైప్ తీసుకు వస్తున్నందుకు అతడి మీద ఎంతో అభిమానాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు ఫ్యాన్స్. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండు గ్లింప్స్, రెండు పాటలు అదిరిపోవడంతో సినిమాకు దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయింది.
చివరగా చరణ్ పుట్టిన రోజుకు రిలీజ్ చేసిన గ్లింప్స్‌తోనూ బుచ్చిబాబు సిక్సర్ కొట్టాడు. కానీ అప్పటికే ఒకసారి వాయిదా పడ్డ సినిమాను మరోసారి ఏప్రిల్ 30 నుంచి వాయిదా వేస్తున్నారన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి మెగా అభిమానుల ఆగ్రహం మామూలుగా లేదు. వాయిదా పక్కా అని తేలినా.. చాలా రోజుల పాటు ఆ విషయం చెప్పకుండా నాన్చడం, చివరికి సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్న విషయం చెబుతూ, రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించకపోవడంతో వారి అసహనం మరింత పెరిగింది.
పెద్ది కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఆదివారం సాయంత్రం తాను చరణ్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు వదిలాడు బుచ్చిబాబు. ఈ దర్శకుడు ఏ ఈవెంట్‌కు వెళ్లినా, సినీ ప్రముఖులు ఎవరిని కలిసినా.. చేతులు కట్టుకుని వినమ్రంగా నిలబడతాడన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబును చరణ్ అనుకరిస్తూ చేతులు కట్టుకున్నాడు ఈ ఫొటోల్లో. తన ఫేవరెట్ పోజ్‌లో చరణ్ అంటూ బుచ్చిబాబు ఈ ఫొటోలను పంచుకోవడం విశేషం.
ఐతే ఓవైపు సినిమా షూట్ ఎంత వరకు వచ్చిందో, ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ ఇవ్వకుండా.. రిలీజ్ డేట్ చెప్పకుండా ఈ ఫొటో షూట్లేంటి.. తాపీగా పోస్టులు పెట్టడం ఏంటి అంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. బుచ్చిబాబును ట్రోల్ చేశారు. అప్పుడు సోషల్ మీడియాలో ఏమి స్పందించని బుచ్చిబాబు రాత్రి కూల్ గా పెద్ది రిలీజ్ డేట్ చెప్పేశాడు.
ధనుష్ మూవీ కర తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన బుచ్చి.. పెద్ది రిలీజ్ డేట్ కోసం గోల పెడుతున్న అభిమానులను మురిపిస్తూ జూన్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేశాడు. సోషల్ మీడియాలో నిర్మాతలు ఘనంగా అనౌన్స్ చేస్తారు అనుకున్న డేట్ ను బుచ్చి ఇంత సింపుల్ గా వేరే సినిమా ఈవెంట్లో చెప్పేయడం మెగా అభిమానులకు షాకే. ఐతేనేం డేట్ అయితే వచ్చేసిందని, ఇదే ఫైనల్ అయితే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on April 27, 2026 8:44 am
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…