సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అందుకే తెలుగు తమిళం నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా టెంప్ట్ అవ్వకుండా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. తన తొలి బాలీవుడ్ మూవీ ‘ఏక్ దిన్’ మే 1 విడుదల కానుంది. ఒక్క రోజు పేరుతో తెలుగు డబ్బింగ్ కూడా చేశారు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా సునీల్ పాండే దర్శకత్వంలో పెద్ద బడ్జెట్ తో రూపొందించారు.

విచిత్రం ఏంటంటే ఏక్ దిన్ మీద బజ్ చాల తక్కువ స్థాయిలో ఉంది. నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టినా ఇప్పటిదాకా బుక్ మై షోలో కేవలం 9 వేల ఇంటరెస్టులు నమోదు కావడం చూస్తే ఓపెనింగ్స్ ఎలా వస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ట్రైలర్ మీద ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి విచిత్రమైన పాయింట్లతో కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారంటూ గట్టి విమర్శలే వస్తున్నాయి. సినిమా రిలీజ్ కాకుండా ఇలా జరగడం అరుదని చెప్పాలి.

ఇంతకీ స్టోరీ ఏంటంటే హీరో రోహన్ తొలి చూపులోనే హీరోయిన్ మీరాని విపరీతంగా ప్రేమిస్తాడు. కానీ ఆమెకు ఆసక్తి ఉండదు. తన ప్రేమను బయట పెట్టుకోలేక కుమిలిపోతున్న కథానాయకుడు. ఆమెతో ఒక్క రోజు ఆనందంగా గడిపే వరం కోరుకుంటాడు. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం వల్ల మీరా ఇరవై నాలుగు గంటలు గతం మర్చిపోతుంది. అప్పుడామెకు రోహన్ తోడుగా ఉండి కొత్త ప్రపంచం చూపిస్తాడు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాలి.

జానైద్ ఖాన్ ని సెటిల్ చేయాలని అమీర్ ఖాన్ ఎంత ట్రై చేస్తున్నా పనవ్వడం లేదు. ఓటిటి డెబ్యూ చేస్తే దారుణంగా పోయింది. లవ్ టుడే రీమేక్ ముచ్చటపడి చేయిస్తే అదేమో రెండో రోజే వెనక్కు వచ్చింది. ఇప్పుడు ఏక్ దిన్ పరిస్థితి ఇలా ఉంది. రామాయణతో వరల్డ్ సినిమా స్థాయికి వెళ్ళబోతున్న సాయిపల్లవికి ఇప్పుడీ ఒక్క రోజు షాక్ ఇస్తుందో స్వీట్ సర్ప్రైజ్ ఇస్తుందో ఇంకో అయిదు రోజుల్లో తేలనుంది. ప్రమోషన్లు కూడా అంతంత మాత్రమే జరగడం మరో మైనస్.