కొన్ని జ్ఞాపకాలు చాలా చేదుగా అనిపిస్తాయి. వద్దన్నా గుర్తు చేసుకునే సందర్భాలు పలకరిస్తాయి. సరిగ్గా ఇదే రోజు 2003 ఏప్రిల్ 25 జానీ విడుదలయ్యింది. రిలీజ్ ముందు విపరీతమైన అంచనాలు. ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమా. అందులోనూ స్వీయ దర్శకత్వం, బద్రి ఫేమ్ రేణుకా దేశాయ్ హీరోయిన్, రమణ గోగుల సంగీతం, వీటికి తోడు భారీతనానికి మారుపేరైన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాణం. కానీ ఒక్క రోజులో సీన్ మారిపోయింది.
జానీ చూసిన అభిమానులు హతాశులయ్యారు. హుషారైన కంటెంట్ తో పవన్ థియేటర్లను హోరెత్తిస్తాడనుకుంటే, జబ్బు పడిన భార్య కోసం తనే పేషెంట్ లా మారిపోయి ఫైట్లు చేస్తాడని ఊహించలేదు. పైగా సింక్ సౌండ్ లాంటి ప్రయోగాలు బెడిసి కొట్టాయి. పాటలు బాగున్నా స్క్రీన్ మీద తేలిపోయాయి. సిద్దార్థ రాయ్ గా అంతకు ముందు ఖుషీలో అరాచకం చేసిన పవన్, జానీలో బక్కపలచని దేహంతో ఉన్న పవన్ ఒకటేనానే అనుమానం అందరిలోనూ కలిగింది.
కట్ చేస్తే జానీ అంచనాలకు మించిన డిజాస్టర్ అయ్యింది. బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. రెండో వారంలోనే ఆక్యుపెన్సీలు పడిపోయాయి. టెక్నికల్ గా మార్కులు పడ్డప్పటికీ అసలైన కంటెంట్ విషయంలో నెగటివ్ కామెంట్స్ విపరీతంగా వచ్చాయి. ఎప్పుడెప్పుడు చూస్తామాని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇంకెప్పుడు చూడకూడదనే ఫీలింగ్ వచ్చేలా చేసింది. రెండు దశాబ్దాల తర్వాత జానీ ఇప్పటి జెన్ జీ కాస్త నచ్చవచ్చేమో కానీ ఫ్లాప్ ఫలితం మారదుగా.
ప్రత్యేకంగా జానీ గురించే ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇంతకన్నా ఫ్లాపులు పవన్ చూడలేదని కాదు. వరసగా ఏడు సూపర్ డూపర్ హిట్లు సాధించాక పవన్ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన మూవీ జానీ. అందుకే ఫ్యాన్స్ అప్పట్లో దీన్నో పీడకలగా చెప్పుకున్నారు. జానీ తర్వాతే పవన్ రేణు దేశాయ్ బంధం మరింత బలపడి భార్యాభర్తలయ్యారు. పవన్ మళ్ళీ డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు. ఏఎం రత్నం మొదలుపెట్టిన సత్యాగ్రహి ఓపెనింగ్ పూజ జరిగిపోయాక ఆగిపోయింది.
This post was last modified on April 25, 2026 4:36 pm
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం మాట ఎలా ఉన్నా.. నాయకులను బలోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ పరిచేందుకు…