ఎవరో ఒక హీరోయిన్.. లేదా కాస్త ఫేమ్ ఉన్న అమ్మాయి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. రెడిట్‌లో తన గురించి వస్తున్న రూమర్స్ నిజమేనా అని అడుగుతారు. లేదంటే తన గురించి వస్తున్న రూమర్స్ నిజమైతే బాగుండనో, అబద్ధమైతే బాగుండనో ఒక కామెంట్ జోడిస్తారు. ఇక అంతే వందలు, వేలమంది పరుగెత్తుకుని వచ్చేస్తారు. అసలేంటి ఆ రూమర్స్ అంటూ ప్రశ్నించడం మొదలుపెడతారు. ఇంకేముంది.. కావాల్సినంత ఎంగేజ్మెంట్.
చివరికి చూస్తే అసలక్కడ రూమర్స్ అంటూ ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా పూర్తిగా కల్పిత కథలే. సోషల్ మీడియా పోస్టులకు ఎంగేజ్మెంట్ పెంచుకుని, డబ్బులు చేసుకోవడానికి ఇప్పుడు నెటిజన్లు ఎంచుకున్న మార్గం ఇది. సెలబ్రెటీ మహిళల గురించి ఏం రాసినా.. సోషల్ మీడియా జనం క్యూరియాసిటీ ప్రదర్శిస్తారు కాబట్టి రోజూ ఇలాంటి కథలే వండుతూ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సోషల్ మీడియా యాప్ రెడిట్‌లో.. రూమర్ సెక్షన్ బాగా ఫేమస్. అక్కడ వచ్చే కొన్ని స్టోరీలు అప్పుడప్పుడూ కొంతమేర నిజం కూడా అవుతుంటాయి. గత ఏఢాది స్మృతి మంధాన పెళ్లి అర్ధంతరంగా ఆగిపోయినపుడు దాని వెనుక అసలు కారణాన్ని బయటపెట్టింది కూడా ఒక రూమర్ స్టోరీనే.
ముందు రూమర్ అనుకున్న విషయమే తర్వాత నిజమని తేలింది. కానీ అక్కడ వచ్చే కథల్లో చాలా వరకు అబద్ధాలు, కల్పితాలే ఉంటాయి. ఈ మధ్య రెడిట్ క్రెడిబిలిటీని బాగా దెబ్బ తీసేలా సెలబ్రెటీ మహిళల గురించి రూమర్లు పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
కొన్ని రోజుల ముందు తమిళ హీరోయిన్ అయిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ గురించి ఏవో కథలు అల్లారు. తాజాగా ఆర్జే కాజల్ మీద ఏదో స్టోరీ రాశారు. ఇలా అమ్మాయిల ఫొటో, దాంతో పాటు రెడిట్ రూమర్ అనే కామెంట్ కనిపించడం ఆలస్యం.. పెద్ద ఎత్తున నెటిజన్లు క్యూరియాసిటీ ప్రదర్శిస్తున్నారు.
కానీ వీళ్ల ఎంగేజ్మెంట్ కోసం లేనిపోని విషయాలు కల్పించి రాసేస్తుండడం అమ్మాయిలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ఎవరో ఒకరు దీనిపై సైబర్ క్రైమ్ వాళ్లకు ఫిర్యాదు చేయడం, పోలీసులు చర్యలు చేపట్టడం జరిగితే తప్ప ఈ ఊహాగానాలకు బ్రేక్ పడేలా లేదు.
This post was last modified on April 20, 2026 3:46 pm
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…