రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ఇది. పైగా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది ఇప్పటిదాకా తీసిన ప్రతి చిత్రంతోనూ బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీ. సన్ పిక్చర్స్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూట్ గత ఏడాది మధ్యలో మొదలైంది. ఇప్పటిదాకా ఒక టైటిల్ లుక్ తప్పితే సినిమా నుంచి ఏ విశేషాన్నీ పంచుకోలేదు.
షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తయినట్లు లేదు. రిలీజ్ వచ్చే ఏడాదే కాబట్టి టీం ఏమీ తొందరపడలేదు. ఐతే చిత్రీకరణ మధ్యలో ఉండగా ఇప్పుడు ఈ చిత్ర లీడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తాను రెండోసారి గర్భవతి అయినట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీపిక, రణ్వీర్ సింగ్ దంపతులకు ఇప్పటికే దువా అనే ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు దీపిక రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయాన్ని వెల్లడించింది.
ప్రెగ్నెన్సీ కిట్‌ను తమ కూతురి చేతిలో పెట్టి ఫొటో తీసి, దాన్ని పంచుకోవడం ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది దీపిక, రణ్వీర్ జంట. దీంతో అందరూ రణ్వీర్, దీపిక దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐతే దీపిక మళ్లీ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె నటిస్తున్న భారీ చిత్రాల సంగతేంటనే సందేహాలు తలెత్తుతున్నాయి.
గత ఏడాది కొన్ని నెలల వ్యవధిలో స్పిరిట్, కల్కి-2 లాంటి భారీ ప్రాజెక్టుల నుంచి దీపిక వైదొలిగింది. అదే సమయంలో ఆమె చేతికి బన్నీ-అట్లీ సినిమాతో పాటు షారుఖ్ ఖాన్ ఫిలిం కింగ్ వచ్చి చేరాయి. ముఖ్యంగా వీటిలో బన్నీ-అట్లీ మూవీ అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి దీపిక తప్పుకోవడంపై పెద్ద చర్చ జరిగిన సమయంలోనే ఈ సినిమా తన చేతికి రావడంతో దీన్ని దీపిక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించింది. మరి ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తి చేశాకే దీపిక ప్రెగ్నెంట్ అయిందా.. లేక తన ప్రెగ్నెన్సీ సినిమాకు ఇబ్బందిగా మారబోతోందా అనే చర్చ జరుగుతోంది.
మరి దీపికా సంబంధిత యాక్షన్ ఎపిసోడ్లు త్వరితగతిన పూర్తి చెయ్యాలని అట్లీ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్, రష్మిక మందన్నా కూడా నటిస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates