ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు దక్షిణాది మీద హిందీ భాషను రుద్దే ప్రయత్నాన్ని విమర్శిస్తూ.. ఆయన రామాయణంతో పోలిక పెట్టి ఒక కథను అల్లారు.
రాముడు ఉత్తరాది నుంచి వచ్చినట్లు.. దక్షిణాదికి చెందిన రావణుడి తోటలో పళ్లు తిన్నట్లుగా ఆయన చెప్పిన కథ తీవ్ర వివాదానికి దారి తీసింది. హిందుత్వ వాదులు ఆ రోజు నుంచి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రకాష్ రాజ్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
మోడీ ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే నేరుగా విమర్శించాలి కానీ.. హిందువులు పరమ పవిత్రంగా భావించే రామాయణాన్ని అడ్డు పెట్టుకుని వెటకారాలు ఆడడం ఏంటి అంటూ ఆయన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఈ వివాదంపై కొన్ని రోజులు మౌనం వహించిన ప్రకాష్ రాజ్.. ఇప్పుడు వివరణ ఇచ్చారు. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కేరళలో. మాట్లాడిందేమో ఇంగ్లిష్‌లో. కానీ ఇప్పుడు వివరణ ఇచ్చింది మాత్రం తెలుగులో కావడం గమనార్హం.
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తుండగా.. తెలుగు వాళ్లే ఎక్కువగా ఆయన మీద ఎటాక్ చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు వ్యవహారమై సెలక్టివ్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పోస్టులు పెట్టడం కూడా ఇక్కడి వాళ్లు ప్రకాష్ రాజ్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగులో వివరణ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఆయనేమన్నారంటే..
‘‘ఇటీవల ఒక సాహిత్య వేడుకలో నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం నుంచి కొన్ని మాటలు మాత్రమే తీసుకుని, దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని వెటకారం చేశానని.. హిందూ ధర్మాన్ని కించపరిచానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాలనూ, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు.
ధర్మానికి మతోన్మాదాన్ని అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్లను నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ, హిందూ ధర్మ విరోధిగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం నాకు అర్థమవుతోంది.
కాబట్టి వాళ్లకు సమాధానం చెప్పాలి. కానీ నేను ఇప్పుడే తమిళనాడు ఎన్నికల ప్రచారం అయిపోయి కొంచెం తోట పనుల్లో ఉన్నాను. ఆ పనులు పూర్తి చేసుకుని త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా? ఇలాగే వాగుతుంటారా? ఊగుతుంటారా అన్నది మీ నిర్ణయం’’ అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.
This post was last modified on April 19, 2026 3:30 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…