Political News

జ‌గ‌న్ ను రాకుండా చేస్తానంటున్న 80 ఏళ్ల ఎమ్మెల్యే

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అధికారంలోకి రాకుండా చేస్తాన‌ని.. అవ‌స‌ర‌మైతే.. చంద్ర‌బాబు ఓకే అంటే.. తాను కూడా పాద‌యాత్ర‌కు రెడీ అంటూ.. రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే, 80 ఏళ్ల‌కు పైబ‌డిన వ‌య‌సున్న సీనియర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌మండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. జ‌గ‌న్ పై నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్‌కు హ‌త్యారాజ‌కీయాలు అల‌వాటేన‌ని పేర్కొన్న గోరంట్ల‌.. ఓ మీడియా అధిప‌తికి జాగ్ర‌త్త‌లు చెప్పారు. ఆయ‌న ప్ర‌జ‌ల కోసం పాటుప‌డుతున్నార‌ని కొనియాడిన గోరంట్ల‌.. ఏ క్ష‌ణ‌మైనా జ‌గ‌న్ నుంచి ప్రాణాల‌కు హాని ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. గ‌తంలో తన తండ్రి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ప‌రిటాల ర‌విని చంపించారంటూ.. జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు గోరంట్ల‌. అంతేకాదు.. బాబాయిని సైతం చంపించార‌ని అన్నారు.

ఇలాంటి నేత .. మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్రానికి, దేశానికి కూడా అరిష్ట‌మేన‌ని.. రెండు కూడా ధ్వంస మ‌వుతాయ‌ని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. ఆయ‌న‌ను అడ్డుకునేందుకు తాను పార్టీ త‌ర‌ఫున శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌న్నారు. కూట‌మి క‌లివిడిగా ఉండాల‌నేది అందుకేన‌ని.. కూట‌మి క‌లివిడి కోసం.. జ‌గ‌న్ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు పాద‌యాత్ర చేయ‌మ‌న్నా చేస్తాన‌ని.. రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ నిజ స్వ‌రూపాన్ని వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చారు.

త‌ల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన జ‌గ‌న్‌.. ఇప్పుడు నీతులు చెబుతున్నార‌ని ఆక్షేపించారు. ఆస్తుల కోసం.. రాజ‌కీయం కోసం.. ఎంత‌కైనా తెగించే జ‌గ‌న్‌.. ఇప్పుడు కూడా అదే పంథాలో కొన‌సాగుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు ఏపీలో ఉండ‌డం రాష్ట్ర ప్ర‌జ‌లు చేసుకున్న దుర‌దృష్ట‌మ‌ని గోరంట్ల చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి మ‌రోసారి గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయితే.. దేశానికి , ప్రపంచానికి కూడా మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు.

This post was last modified on April 19, 2026 3:24 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago