Movie News

సూపర్ స్టార్ కొడుకు జీతం రూ.4500

ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను కట్టే ఇండియన్ హీరోగా రికార్డు కూడా నెలకొల్పాడు. అలాంటి హీరో కొడుకు కేవలం రూ.4500 జీతానికి పని చేస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇదే నిజం అంటున్నాడీ సీనియర్ హీరో. అక్షయ్, ట్వింకిల్ ఖన్నాలకు ఇద్దరు పిల్లలు కాగా.. అందులో పెద్దవాడు ఆరవ్ కుమార్.

అక్షయ్ పెద్ద స్టార్ కాబట్టి ఆటోమేటిగ్గా తన కొడుకు కూడా సినిమాల్లోకే వస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ తన కొడుక్కి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని అక్షయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అతను ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ దిశగా అవగాహన పెంచుకునేందుకు గాను ఆరవ్ గ్రామాల్లో తిరుగుతున్నాడని.. కేవలం రూ.4500 జీతానికి పని చేస్తున్నాడని అక్షయ్ వెల్లడించాడు.

ఆరవ్ చాలా విషయాల్లో తనలాగే ఉంటాడని, కొన్ని విషయాల్లో మాత్రమే భిన్నంగా కనిపిస్తాడని అక్షయ్ చెప్పాడు. తనలాగే అతడికీ ఆరోగ్యం, ఆహారం మీద ఎంతో శ్రద్ధ ఉందని.. కానీ తనలా అతడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం మాత్రం లేదని అక్షయ్ స్పష్టం చేశాడు.

ఆరవ్‌కు సింపుల్‌గా ఉండడం ఇష్టమని, సెలబ్రెటీ లైఫ్‌ను కోరుకోడని.. తనకు ఇష్టమైన ఫ్యాషన్ రంగంలో పని చేయడానికి ఇష్టపడుతున్నాడని చెప్పాడు. ఇందులో భాగంగా గ్రామాలకు వెళ్లి రకరకాల ప్రింట్లు, ఫ్యాషన్ డిజైన్ల గురించి స్వయంగా నేర్చుకుంటున్నట్లు అక్షయ్ తెలిపాడు.
ఆరవ్ మంచి కుక్ కూడా అని ఆయన చెప్పాడు.

తాను కొడుక్కి పెద్దగా లెక్చర్లు ఇవ్వనని.. అతడికి ఇచ్చే ఏకైక సలహా ‘ఎవరికీ హాని చేయవద్దు’ అని మాత్రమేనని అక్షయ్ పేర్కొన్నాడు. అక్షయ్ కొడుకు ఎలాగూ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించబోనని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన తనయురాలు నిటారా అయినా ఈ రంగం వైపు అడుగులేస్తుందేమో చూడాలి. అక్షయ్ లీడ్ రోల్ చేసిన ‘భూత్ బంగ్లా’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

This post was last modified on April 19, 2026 2:04 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

30 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

38 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago