Political News

అజారుద్దీన్ మంత్రిగిరీ సేఫేనా…?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగిరీ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ఈ నెలాఖరులోగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే… అజ్జూ భాయ్ మంత్రిగిరీ ఊడిపోయినట్టే.

ఎందుకంటే…ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యుడిగా లేకుండానే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన నేత ఆరు నెలల్లోగా అటు ఎమ్మెల్యేగానో, లేదంటే ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంది. అలా కాని పక్షంలో ముఖ్యమంత్రి అయినా, మంత్రులు అయినా తమ పదవులను ఇట్టే కోల్పోతారు.

క్రికెటర్ గా తన కెరీర్ ను ముగించిన వెంటనే అజారుద్దీన్ పెద్దగా లేట్ చేయకుండానే రాజకీయాల్లోకి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. మొరాదాబాద్ నుంచి ఓ దఫా ఎంపీగా ఎన్నికైన అజారుద్ధీన్… ఆ తర్వాత ఎన్నికల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినా విజయం దక్కలేదు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం దక్కింది. ఆ వెంటనే ఆయనను రేవంత్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. మైనార్టీ సంక్షేమంతో పాటుగా పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ను అజారుద్దీన్ కు అప్పగించారు. అయితే అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాంల ఎమ్మెల్సీ పదవులకు ఇప్పటిదాకా గవర్నర్ అనుమతే లభించలేదు.

డిసెంబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ లెక్కన ఈ నెలాఖరు నాటికి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. అలా కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.

ఆదివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన రేవంత్…గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. చాలా రోజులుగా రాజ్ భవన్ లో పెండింగ్ లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్ ను క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ఆయన శుక్లాను కోరారు. సీఎం ప్రతిపాదనకు శుక్లా ఓకే అంటే సరేసరి. లేదంటే… ఈ నెలాఖరు తర్వాత మంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదు.

This post was last modified on April 19, 2026 2:37 pm

Share

Recent Posts

బ్రిటిష్ పౌరసత్వం వచ్చినా… ఇక్కడ కేసులు పోవు లలిత్ మోదీ

ఒకప్పుడు భారత క్రికెట్‌లో లలిత్ మోదీ మాటకు ఎంతో విలువ ఉండేది. ఐపీఎల్‌ను ప్రారంభించి బీసీసీఐకి భారీ ఆదాయం వచ్చేలా…

23 minutes ago

రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోలేదు కానీ..

లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ, సీనియర్ నటి రమ్యకృష్ణల వివాహ బంధం గురించి జనాలకు అనేక సందేహాలున్నాయి. వీళ్లిద్దరూ కలిసి జీవిస్తున్న…

26 minutes ago

క్యాన్సర్ ఫైట్‌లో కొత్త టెక్నాలజీ.. 95 వేల ఖర్చు!

క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిశోధనలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. వ్యాధిని గుర్తించడం, కణితులను తొలగించడం, కీమోథెరపీ, రేడియేషన్…

1 hour ago

కీర్తి సురేష్‌కు మళ్ళీ సావిత్రి కలిసి వస్తుందా

మహానటి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరే దాని ప్రభావం ఇండస్ట్రీ మీద ఇంకా చూస్తూనే ఉంటాం. ఆ…

2 hours ago

బన్నీతో బోయపాటి… మాస్టర్ ప్లాన్ అంటే ఇది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కలయికతో గతంలో సరైనోడు వచ్చింది. బన్నీ మాస్ ఇమేజ్ అమాంతం…

3 hours ago

వామ్మో… ఇన్ని తుఫానులను తట్టుకునేది ఎలా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రకృతి మరోసారి పరీక్ష పెట్టబోతోందా? ఇప్పటికే రెండు తుఫానుల ప్రభావంతో అతలాకుతలమైన రాష్ట్రానికి ఇప్పుడు మూడో తుఫాను…

3 hours ago