నటుడిగా రవిబాబుకి ఎంత పేరుందో దర్శకుడిగా అతన్ని అభిమానించే వాళ్ళ సంఖ్య కూడా పెద్దదే. అల్లరి లాంటి యూత్ ఫుల్ స్టోరీ తీసినా, అనసూయ లాంటి క్రైమ్ థ్రిల్లర్ తో మెప్పించినా ఆయనకే చెల్లింది. నచ్చావులే, అమరావతి లాంటి చెప్పుకోదగ్గ హిట్స్ రవిబాబు ఖాతాలో ఉన్నాయి. పూర్ణ ప్రధాన పాత్రలో తీసిన అవును కొత్త ట్రెండ్ కు దారి తీసింది. ఆ తర్వాత ఈ క్రియేటివ్ డైరెక్టర్ నుంచి ఆశించిన సినిమాలు రాలేదు. ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు పడ్డాయి.
వచ్చే నెల మే 8 రవిబాబు కొత్త మూవీ రేజర్ విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ క్రైమ్ డ్రామాలో హీరో కూడా రవిబాబే. అసలు విశేషం ఇది కాదు. తాజాగా రిలీజ్ చేసిన మూడు నిమిషాల ట్రైలర్ లో వయొలెన్స్ ఫుల్లుగా నింపేశారు. ఒక రాజకీయ నాయకుడు, కొందరు రౌడీలు ఒక పాప ప్రాణం తీయడానికి తెగబడితే తనకు తోడుగా ఉండి కాపాడేందుకు నరమేథం చేస్తాడొకడు. అతను ఎందుకలా చేశాడు, పాప ఫ్లాష్ బ్యాక్ ఏంటి లాంటి ప్రశ్నలు తెరమీద చూడాలి.
మాములుగా సా – హాస్టల్ లాంటి హాలీవుడ్ మూవీస్, నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లలో మితిమీరిన హింసని చూస్తుంటాం. మనుషులను ఇలా కూడా చంపొచ్చా అనే స్థాయిలో వాటిలో మర్డర్స్ ని ప్రెజెంట్ చేస్తారు. రేజర్ లో రవిబాబు ఇవే ఫాలో అయినట్టుగా ఉంది. అతి కిరాతకంగా ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఫైట్లకు సెన్సార్ అంత ఈజీగా ఆమోదం ఇచ్చేస్తుందానే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎంత A సర్టిఫికెట్ ఇచ్చినా పెద్దలైనా ఇంత వయొలెన్స్ భరించాలిగా.
ఒకవేళ రేజర్ కనక సక్సెస్ అయితే రవిబాబు కొత్త ఇన్నింగ్స్ మొదలైనట్టే. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా తన మీద నిర్మాత సురేష్ బాబుకి అపారమైన నమ్మకం. అల్లరి నుంచి ఈ బాండింగ్ కొనసాగుతోంది. ఆ నమ్మకంతోనే రేజర్ కు ఎస్ చెప్పారు కాబోలు. ట్రైలర్ చూస్తే చాలు ఓటిటి సంస్థలు కళ్ళు మూసుకుని మంచి రేట్ ఇచ్చేలా ఉన్నాయి. వాళ్లకు వర్కౌటయ్యే జానరే ఇది. ప్రత్యేకంగా హీరోయిన్, పాటలు, కమర్షియల్ మసాలాలు లేని రేజర్ ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందో వేచి చూడాలి.
This post was last modified on April 18, 2026 7:06 pm
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…