ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా ‘జననాయగన్’ విషయంలోనే జరిగి ఉండొచ్చు. సినిమా రిలీజ్ రోజు హై క్వాలిటీ పైరసీ ప్రింట్లు బయటికి రావడం చూశాం కానీ.. అసలు విడుదల ఎప్పుడో కూడా తెలియని చిత్రానికి ఇలా జరగడం మాత్రం అనూహ్యం.
దీన్ని బట్టి యూనిట్‌కు చెందిన వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అందరూ భావించారు. మరి నిందితులు ఎవరై ఉంటారు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అయిదుగురు అనుమానితులను ఇంతకుముందు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వారిలో నిందితులు ఎవరన్న దానిపై పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ‘జననాయగన్’ లీక్ వెనుక ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ ‘జననాయగన్’ లీక్ వెనుక సూత్రధారి అని తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఐతే అతనేమీ ఈ సినిమాకు పని చేయలేదట. ఎడిటింగ్ విభాగంలోని వారితో ఉన్న పరిచయాల ద్వారా ఈ సినిమా ఎడిటింగ్ జరిగే చోటుకు వెళ్లి రహస్యంగా డేటాను చోరీ చేశాడట ఆ వ్యక్తి.
కొంచెం కొంచెంగా డేటా తీసుకుని.. దాన్ని క్లబ్ చేసి మొత్తం సినిమాను ఆన్ లైన్లో లీక్ చేసేశాడట. ఇందులో ఇంకో ఇద్దరు నిందితుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు తేల్చారు.
లీక్ విషయంలో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉండడం, రాజకీయంగా కూడా ‘జననాయగన్’ అంశం చర్చనీయాంశంగా మారడం..
ఈ నేపథ్యంలో నిందితుల వివరాలను బయటపెడితే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో పోలీసులు డీటైల్స్ బయటికి రాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా.. వారికి జడ్జి రిమాండ్ విధించారు. విచారణలో మరిన్ని వివరాలు బయటికి వస్తాయని భావిస్తున్నారు.
This post was last modified on April 16, 2026 6:38 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…