Movie News

గాడ్ ఆఫ్ వార్… ఏదో ఒకటి తేలిపోవాలి

గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్ ఎంటర్టైనర్లే తీస్తూ వచ్చిన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకున్న ఈవెంట్ ఫిలిం ఇది. ముందు అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా చేయాలనుకున్నాడు మాటల మాంత్రికుడు. కానీ ఎందుకో ఇద్దరికీ ఈ ప్రాజెక్టు విషయంలో సమన్వయం కుదరలేదు.

తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. తారక్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తితో ఉన్నట్లే కనిపించాడు. కానీ మళ్లీ జూనియర్ వెనక్కి తగ్గాడని, బన్నీతోనే త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడని ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ అదీ నిజం కాదని తేలింది. చివరికి తారకే ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తాడన్నట్లుగా మాట్లాడుకున్నారు సోషల్ మీడియా జనాలు. ఇటు తారక్, అటు త్రివిక్రమ్ ఫ్యాన్స్.. ఈ కాంబినేషన్‌కు ఫిక్స్ అయిపోయి ఉన్నారు.

ఐతే ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అన్నది ఇంకో నెల రోజుల్లో తేలిపోనుంది. మే 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ రోజు ఎలాగూ తారక్ ప్రెజెంట్ మూవీ ‘డ్రాగన్’ నుంచి అప్‌డేట్ ఉంటుంది. గత పుట్టిన రోజుకు అభిమానులను మురిపించలేకపోయిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈసారి గ్లింప్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

దీంతో పాటుగా తారక్ అభిమానులకు డబుల్ ధమాకా ఆనందాన్నిస్తూ ‘గాడ్ ఆఫ్ వార్’ను ప్రకటిస్తారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆ రోజు ఈ సినిమాను ప్రకటించారు అంటే.. త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నట్లు. లేదంటే మొత్తంగా ఆ ప్రాజెక్టును పక్కన పెడుతున్నట్లు భావించాలి.

ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఎక్కువగా టచ్ చేయని సుబ్రహ్మణ్యస్వామి కథను భారీ స్థాయిలో చెప్పాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. ఈ సినిమా అంటూ ఉంటే.. ఆయనకు దాదాపు హోం బేనర్ అనదగ్గ హారిక అండ్ హాసిని క్రియేషన్సే దీన్ని నిర్మిస్తుంది.

This post was last modified on April 16, 2026 6:36 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago