Movie News

కిరణ్ అబ్బవరం‌ను మెచ్చుకోవాల్సిందే

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాడు కిరణ్ అబ్బవరం. తన సినిమాల రైటింగ్, మేకింగ్‌లోనూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యే కిరణ్.. తనకంటూ ఒక స్థాయి తెచ్చుకోవడం వెనుక తన కష్టం చాలానే ఉంది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అతనిప్పుడు నిర్మాతగా మారి బయటి వాళ్లతో సినిమా కూడా చేశాడు. అదే.. తిమ్మరాజుపల్లి టీవీ. 

ఇందులో దర్శకుడు, హీరో దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ కొత్త వాళ్లే కావడం విశేషం. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిపి ఏకంగా 50 మంది కొత్త వాళ్లను కిరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్ర కథానాయకుడు సాయితేజ్‌ బ్యాగ్రౌండ్ తెలిస్తే కిరణ్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. అతను కిరణ్ నటించిన కొన్ని చిత్రాలకు కెమెరా అసిస్టెంట్‌గా పని చేశాడు. తనకు నటన మీద ఆసక్తి ఉన్న విషయం తెలుసుకుని, తన ప్రతిభను గుర్తించి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంతో హీరోను చేశాడు.

ఇంకా ఎంతోమంది కొత్త వాళ్లకు ఈ సినిమాతో అవకాశం ఇస్తున్నాడు కిరణ్. అంతే కాదు.. ఇందులోని నటీనటులు, టెక్నీషియన్ల కుటుంబ సభ్యులను పిలిచి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని బిగ్ స్క్రీన్ మీద స్పెషల్ షో కూడా ఏర్పాటు చేయిస్తున్నాడు కిరణ్. ఈ విషయంలో ఇండస్ట్రీ వర్గాలు కిరణ్‌ను అభినందిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా కిరణ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. 

కొత్త దర్శకుడు మునిరాజు రూపొందించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించాయి. 80, 90 దశకాల్లో కొత్తగా పల్లెటూళ్లలోకి టీవీలు వచ్చినప్పటి పరిస్థితులను సరదాగా చూపించే ప్రయత్నమే ‘తిమ్మరాజుపల్లి టీవీ’. మరి కిరణ్ కొత్త వాళ్లతో చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

This post was last modified on April 15, 2026 7:16 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

10 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago