Movie News

నమ్మొచ్చా… టైటిల్ కోసం 112 కోట్లు

ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో తొలి ఫ్లాప్ నమోదు కావడం ఖాయమని బయ్యర్లు చెబుతున్నారు. వరసగా మూడు వంద కోట్ల గ్రాసర్లు ఇచ్చి మరోసారి ఆ ఫీట్ చేస్తాడనుకుంటే ఆ ఛాన్స్ మిస్ కావడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే పోస్ట్ ప్రమోషన్ల కోసం దర్శకుడు విగ్నేష్ శివం చెబుతున్న మాటలు కొన్ని ఆశ్చర్యకరంగా, షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

ఈ సినిమా ముందు రాజ్ కమల్ బ్యానర్ మీద కమల్ హాసన్ నిర్మించేందుకు రెడీ అయ్యారు. కానీ పది నెలలు ప్రాజెక్టులో ఎలాంటి కదలిక లేదు. తర్వాత సెవెన్ స్క్రీన్స్ సంస్థ ముందుకొచ్చింది. తొలుత రెండు వందల కోట్ల బడ్జెట్ అనుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ వచ్చి వంద కోట్లలోపే పూర్తి చేశారు. ఓటిటి మార్కెట్ హఠాత్తుగా పడిపోవడంతో నిర్మాతకు ఫైనాన్స్ తేవడం కూడా ఒకదశలో కష్టమైపోయింది. విగ్నేష్ భార్య నయనతార డబ్బు సర్దుబాటు చేసింది.

ఇక టైటిల్ గురించి చెబుతూ ముందు ఎల్ఐసీ అని పెడదామనుకుని అనుమతి అడిగితే వాళ్ళు ఏకంగా 112 కోట్లు డిమాండ్ చేయడంతో వెనక్కు తగ్గి ఎల్ఐకె ఆప్షన్ ఎంచుకున్నానని అన్నారు. అంత డబ్బు లేకపోవడంతో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇలా ఒక సినిమాకు తమ పేరు పెట్టుకోవడానికి అంత డిమాండ్ చేసిందానేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తే బెటర్.

ఇదంతా ఎలా ఉన్నా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిదు రోజులకు గాను సుమారు నలభై కోట్ల దాకా వసూలు చేసి డీసెంట్ అనిపించుకుంది. అది కూడా ప్రదీప్ రంగనాథన్ ఇమేజ్ వల్ల తప్పించి మరొకటి కాదు. విగ్నేష్ శివన్ దర్శకత్వం మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. 2040 బ్యాక్ డ్రాప్ తో ఇంత సాగదీసిన టెక్నికల్ లవ్ స్టోరీ ఎందుకు చెప్పాడని విమర్శకులు తలంటారు. తెలుగు వర్షన్ మాత్రం అనుకున్న దానికన్నా త్వరగా వాషౌట్ అయిపోయేలా ఉంది.  

This post was last modified on April 15, 2026 11:52 am

Share

Recent Posts

ఎన్విడియా ఉద్యోగులు మళ్ళీ అతన్నే కోరుకుంటున్నారు

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియాలో ఊహించని పరిస్థితి నెలకొంది. కంపెనీని 33 ఏళ్ల పాటు నడిపించిన జెన్సన్…

23 minutes ago

గంభీర్ బ్రో… వరల్డ్ కప్‌కు ఉన్నది ఏడాదే

వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుండగా టీమ్ఇండియాకు ఓ సమస్య పెద్ద తలనొప్పిగా మారుతోంది. స్వదేశంలో భారీ స్కోర్లు…

1 hour ago

‘రిపీట్’ హైప్ సరిపోతుందా బాసూ

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది రిపీట్ మీద బయ్యర్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.…

1 hour ago

దిల్ రాజు.. రావిపూడి.. 2028 సంక్రాంతి

హిట్ మెషీన్‌గా పేరున్న అనిల్ రావిపూడి.. సంక్రాంతికి త‌న సినిమాను తీసుకొచ్చాడంటే అది బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల్సిందే. ఈ ఏడాది…

3 hours ago

తమన్ మనసు పెడితే…

రెండు వారాల ముందే ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజైంది. ఆ చిత్రానికి ముందు అనుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్.…

4 hours ago

అమెరికా విమానాశ్రయాల్లో ఏం జరుగుతుంది?

అమెరికాలో శుక్రవారం విమాన ప్రయాణాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ…

5 hours ago