సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది. తాజాగా డెకాయిట్ ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్ న్యాచురల్ స్టార్ నానితో కలిసి ఒక వీడియో ఇంటర్వ్యూ చేశాడు. తాను నిర్మించిన హిట్ 2 హీరో, హిట్ 3లో క్యామియో చేసిన శేష్ అంటే నానికి ప్రత్యేకమైన బంధం ఉండటంలో ఆశ్చర్యం లేదు. అందుకే ప్యారడైజ్ లో బిజీగా ఉన్నప్పటికీ అడివి శేష్ కోసం సమయం కేటాయించాడు.
ఇందులో భాగంగా నాని అన్నమాటలు జనాలకు రకరకాల అర్థాల్లో వెళ్లిపోయాయి. డెకాయిట్ చూశాక ఒక ప్రేక్షకుడిగా తాను గౌరవింపబడ్డ ఫీలింగ్ కలిగిందని, ఈ మధ్య కొందరు మేకర్స్ ఆడియన్స్ ని తక్కువగా చూస్తూ మీకిదే ఎక్కువనే తరహాలో ప్రవర్తిస్తున్నారని చిన్న చురక వేశాడు. ఆయన అన్నది ఫలానా నిర్మాతనేనని కొందరు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే అదే ప్రొడ్యూసర్ తో నాని ఒక కల్ట్ క్లాసిక్ చేసిన విషయాన్ని వాళ్ళు తేలిగ్గా మర్చిపోతున్నారు.
అంతే కాదు మేజర్, గూఢచారి కంటే డెకాయిట్ చాలా బాగుందని నాని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది నిజమా కాదానేది పక్కనపెడితే స్నేహ ధర్మం, అందులోనూ సాటి హీరో ఎంతో కష్టపడి ఇంత పెద్ద సినిమా చేసినప్పుడు పొగడ్తల మీటర్ కాస్త పైనే ఉంటుంది. అంతెందుకు ఇది అందరూ చేసే పనే. బైకర్ మీద ఇంతకన్నా గొప్పగా వారం రోజులకు పైగానే ఎందరో పొగడ్తల వర్షం కురిపించారు. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి కష్టపడుతోంది.
సో నాని అన్నాడని లేక అనలేదని డెకాయిట్ కలెక్షన్లు పెరగడం తరగడం ఉండదు. జనాలు చాలా తెలివైన వాళ్ళు. గుడ్డిగా థియేటర్లకు వెళ్లే పరిస్థితిలో లేరు. కాకపోతే అడివి శేష్ ఏర్పరుచుకున్న నమ్మకం డెకాయిట్ కొచ్చిన మిక్స్డ్ టాక్ తట్టుకునేలా చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చింది. థియేటర్ లెక్కల్లో సూపర్ హిట్ అవుతుందా లేదానేది ఇంకో అయిదారు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా నానిని కొందరు లక్ష్యంగా పెట్టుకోవడం మాత్రం ఊహించని వింత.
This post was last modified on April 14, 2026 6:31 am
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…