టాలీవుడ్‌కు 2026 సంవత్సరం ఎంతో ఆశాజనకంగా ఆరంభం అయింది. ఈ ఏడాది సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజైతే అందులో ఒకటి (మన శంకర వరప్రసాద్ గారు) రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇంకో రెండు (అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి) సూపర్ హిట్లు అయ్యాయి. మిగతా రెండు చిత్రాలకు నిరాశ తప్పకపోయినా.. ఓవరాల్‌గా సంక్రాంతికి బాక్సాఫీస్ కళకళలాడింది. 2026 మీద ఎన్నో అంచనాలు రేకెత్తించింది ఆ సీజన్. కానీ పండుగ తర్వాత మాత్రం బాక్సాఫీస్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
రెండున్నర నెలల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలున్నాయి. ఫ్లాప్ టాక్‌తో మొదలైనవి ఉన్నాయి. కానీ ఏవీ నిర్మాతలకు లాభాలు అందించలేకపోయాయి. ఐతే ఏప్రిల్ నెల కొంత ఆశాజనకంగా మొదలైంది. ‘బైకర్’ సినిమా వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. ‘రాకాస’కు మంచి కలెక్షన్లే వచ్చాయి. అది నిర్మాత నిహారికకు ప్రాఫిటబుల్ వెంచరే అయింది.
కాగా గత వీకెండ్లో వచ్చిన ‘డెకాయిట్’ సంక్రాంతి చిత్రాల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బాక్సాఫీస్‌ను కళకళలాడించిన సినిమాగా చెప్పుకోవచ్చు. వీకెండ్లో ఈ సినిమా రూ.40 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. అడివి శేష్ రేంజ్ ఎంతో పెరిగిందనడానికి ఇది సూచిక.
శేష్ గత చిత్రాల్లా ‘డెకాయిట్’కు సూపర్ టాక్ ఏమీ రాలేదు. యావరేజ్ అన్న మాటలే వినిపించాయి. కానీ తన గత చిత్రాలతో ప్రేక్షకుల్లో తెచ్చుకున్న నమ్మకం అతడి కొత్త చిత్రానికి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఇది పెద్ద బడ్జెట్ సినిమానే అయినా.. థియేట్రికల్ టార్గెట్ మరీ పెద్దదేమీ కాదు. రూ.65 కోట్లలో తెరకెక్కిన సినిమాకు డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల నుంచే రూ.46 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు సమాచారం.
థియేటర్ల నుంచి రూ.19 కోట్లు వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే అని అంటున్నారు కానీ అది కేవలం నిర్మాత లెక్క కిందకే వస్తుంది. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా రావలసి ఉంది. వీకెండ్ తర్వాత సినిమా జోరు తగ్గింది కానీ.. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. రాబోయే వీకెండ్లో వచ్చేవన్నీ చిన్న సినిమాలే కాబట్టి.. శని, ఆదివారాల్లో ఈ చిత్రానికి మంచి షేరే వచ్చే అవకాశముయంది. కాబట్టి సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ కొంచం ఊపిరి పీల్చుకున్నట్టు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. పెద్ది ఎంత త్వరగా వస్తే థియేటర్లకు అంత మంచిది.
This post was last modified on April 14, 2026 12:15 pm
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…
ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…