షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకేసారి మే నుంచి అంత దూరం వెళ్లిపోవడం అభిమానులు ఇష్టం లేకపోయినా బెస్ట్ అవుట్ ఫుట్ వస్తే చాలులెమ్మని సైలెంట్ అయ్యారు. కాకపోతే పోస్ట్ పోన్ కారణంగా పెద్దిని చూపించడమే అంతగా సింక్ కాలేదు. ఇదిలా ఉండగా పెద్ది కొత్త డేట్ మీద యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది. రెండు ఆప్షన్లు సీరియస్ గా పరిశీలిస్తున్నారట.
మొదటిది జూన్ 4. అదే రోజు యష్ టాక్సిక్ వస్తోంది. మాట మీద ఉంటుందా లేదానే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. అఫీషియల్ గా అయితే ప్రకటించారు. నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రస్తుతం బోలెడు సమస్యలు ఎదురుకుంటోంది. జన నాయకుడు సెన్సారే పెద్ద తలనెప్పి అనుకుంటే హెచ్డి క్వాలిటీతో మూవీ పైరసీ కావడం కోలీవుడ్ లోనే కాదు మొత్తం అన్ని పరిశ్రమల్లో కలకలం రేపింది. సో ఇవన్నీ దాటుకుని జన నాయకుడు రిలీజ్ చేసి ఆపై టాక్సిక్ పనులు చూడాల్సి ఉంటుంది.
బెంగళూరు టాక్ ప్రకారం టాక్సిక్ ఈసారి చెప్పిన తేదీకి వస్తుంది. అదే జరిగిన పక్షంలో పెద్ది జూన్ 25 లేదా 26 ఎంచుకోవాలి. కానీ ఆల్రెడీ లెనిన్ ఉన్నాడు కాబట్టి పెద్ది జూలైకు వెళ్లే ఆలోచన చేస్తుందా అంటే అనుమానమే. లేదూ మాకు అదే తేదీ కావాలంటే అఖిల్ తప్పుకోవాల్సి ఉంటుంది. రామ్ చరణ్, మైత్రి మేకర్స్ తో లెనిన్ నిర్మాతలు నాగార్జున, నాగవంశీకున్న సత్సంబంధాలు చూసుకుంటే రెండు పరస్పరం క్లాష్ కావడం అసాధ్యమనే చెప్పాలి.
పైగా లెనిన్ సోలోగా రావడం ఉత్తమం. కంటెంట్ ఎంత బాగున్నా కాంపిటీషన్ లో కాకుండా ఒంటరిగా వస్తే ఓపెనింగ్స్ తో పాటు మంచి రెవిన్యూ చూడొచ్చు. పెద్ది వస్తుందో రాదో అనే అపనమ్మకంతో లెనిన్ ధైర్యంగా జూన్ 26 వేసేసుకుంది. ఒకవేళ మార్చుకోవాల్సి వస్తే మాత్రం అఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైర్ కావడం ఖాయం. మురళకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన లెనిన్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమాకూరుస్తున్నారు.
This post was last modified on April 12, 2026 1:25 pm
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…