Political News

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని బ‌హిరంగ స‌భ‌లోనే వ్యాఖ్యానించారు. ములుగు జిల్లాలో నిర్వ‌హించిన ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీత‌క్క‌.. ఇటీవ‌ల త‌న‌పై బీఆర్ ఎస్ నేత‌లు చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. మ‌హిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీత‌క్క‌.. రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్ వాడీ కేంద్రాల్లోని మ‌హిళా ఉద్యోగుల‌కు స్మార్టు ఫోన్ల‌ను పంపిణీ చేశారు.

అయితే.. ఈ వ్య‌వ‌హారంలో సీత‌క్క అవినీతికి పాల్ప‌డ్డారంటూ బీఆర్ ఎస్‌లోని కొంద‌రు నాయ‌కులు వ్యాఖ్యానించారు. ఒక్కొక్క ఫోనును అధిక మొత్తానికి కొనుగోలు చేసి.. క‌మీష‌న్ల రూపంలో సొమ్ము చేసుకున్నార‌ని ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై తాజాగా సీత‌క్క రియాక్ట్ అయ్యారు. ఒక్కొక్క ఫోనును 11650 రూపాయ‌ల‌కు మాత్ర‌మే కొనుగోలు చేశామ‌ని చెప్పారు. కానీ.. కొంద‌రు త‌న‌పై అవినీతి ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తూ.. ఒక్కొక్క ఫోన్‌ను 14 వేల రూపాయ‌ల‌కు పైగా మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న వారికి చెప్పుతెగేలా బుద్ధి చెబుతాన‌ని మంత్రి సీత‌క్క బ్లాస్ట్ అయ్యారు. తాను అవినీతికి పాల్ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. త‌న ప‌రిధిలో ఎక్క‌డ అవినీతి జ‌రిగిందో ఆధారాల‌తో స‌హా చెప్పాల‌ని ఆమె బీఆర్ ఎస్ నాయకుల‌కు ఆమె స‌వాల్ రువ్వారు. ఫోన్ల కొనుగోలులో అంతా పార‌ద‌ర్శ‌కంగానే జ‌రిగింద‌న్నారు. ప్ర‌తి రూపాయికీ జ‌వాబుదా రీగా ఉన్నాన‌న్నారు. రాజ‌కీయ ప్రేరేపిత అవినీతి ఆరోప‌ణ‌లు చేసేవారికి చెప్పుతెగుద్ద‌ని హెచ్చ‌రించారు. మేడారం ప‌నుల్లోనూ గ‌తంలో తాను అవినీతి చేసిన‌ట్టు ఆరోపించార‌ని.. కానీ.. నిరూపించ‌లేక పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అధికారంలో ఉన్నా..

వాస్త‌వానికి ఇటీవ‌ల తెలంగాణ‌నాయ‌కులు హ‌ద్దులు మీరుతున్నారు. మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న‌వారు..నోరు చేసుకుంటున్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు స‌హజం. వాటికి అదే రీతిలో స‌మాధానం చెప్పాలి. ప్ర‌జాస్వామ్య రీతిలోనే మంత్రులుగా ఉన్న‌వారు మాట్లాడాలి. కానీ, చెప్పుతెగుద్ది.. ల‌గెత్తించి కొడ‌తాం.. బ‌ట్టులు ఊడ‌దీయిస్తాం.. వంటి కృత‌క, ముత‌క భాష‌ను వినియోగించ‌డం స‌రికాద‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయం వేరు.. అధికారం వేరు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న నేప‌థ్యంలో మంత్రులు ఒకింత జాగ్ర‌త్త‌గా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది.

This post was last modified on April 12, 2026 11:22 am

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

1 hour ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

2 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

3 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

4 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

4 hours ago