Movie News

ఇప్పుడు జన నాయగన్… అప్పుడు జగ్గు భాయ్

సినిమాలు రిలీజయ్యాక పైరసీ అవ్వడం.. ఆన్ లైన్లో లీక్ కావడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఎంత ఆపాలని ప్రయత్నించినా.. ఈ విష సంస్కృతి ఆగడం లేదు. దీని వల్ల సినీ పరిశ్రమకు వందలు, వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఐతే ఇప్పుడు తమిళంలో ‘జననాయగన్’ సినిమా థియేటర్లలో మూవీ రిలీజ్ కావడానికి ముందే ఆన్ లైన్లో లీక్ అయిపోవడం పట్ల అందరూ షాకైపోతున్నారు.

ఫుల్ హెచ్డీ ప్రింటును ఎవరో ఆన్ లైన్లోకి వదిలేశారు. దాన్ని లక్షల మంది డౌన్ లోడ్ చేసుకుని చూసేయడం టీంను తీవ్ర మనోవేదనకు గురి చేసేదే. ఏకంగా రూ.400 కోట్ల ఖర్చుతో తీసిన సినిమాకు ఇలా కావడం ఎంతో బాధాకరం. చిత్ర బృందంలోని వారే ఈ దారుణానికి ఒడిగట్టారన్నది స్పష్టం. ఐతే ఇలా విడుదలకు ముందే సినిమా లీక్ అయిపోయిన ఉదంతం పూర్తిగా కొత్తేమీ కాదు.

గతంలో తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ఇలాగే లీక్ అయింది. కానీ ఆ సినిమా సగం వరకే ఆన్ లైన్లోకి వచ్చింది. ఆలస్యం చేయకుండా చిత్ర బృందం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేయడం, సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అద్భుత ఫలితం రావడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు.

కానీ ‘జననాగయన్’ పరిస్థితి వేరు. పూర్తి సినిమా, హెచ్‌డీ ప్రింట్ ఆన్ లైన్లోకి వచ్చేసింది. పైగా ఈ సినిమా ఇప్పుడిప్పుడే థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి భారీ నష్టం వాటిల్లినట్లే. ఇలా రిలీజ్‌కు ముందు పూర్తి సినిమా ఆన్ లైన్లోకి వచ్చేయడం వల్ల నాశనం అయిన ఇంకో సినిమా తమిళంలో ఉంది. అదే.. జగ్గూభాయ్.

అది శరత్ కుమార్ హీరోగా సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. శరత్ సొంత సంస్థలో ఈ సినిమా తెరకెక్కింది. ఐతే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో.. ఆన్ లైన్లోకి వచ్చేసింది. ఎవరో యూనిట్ నుంచే అన్ ఫినిష్డ్ వెర్షన్‌ను ఆన్ లైన్లో లీక్ చేసేశారు.

దీంతో శరత్ కుమార్, ఆయన భార్య రాధిక కలిసి ప్రెస్ మీట్ పెట్టి బోరుమన్నారు. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకోగా.. రాధిక అయితే గట్టిగా ఏడ్చేశారు. నష్ట నివారణ కోసం తర్వాత చిత్ర బృందం క్లైమాక్స్ మార్చి షూట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. థియేటర్లలో జనం పెద్దగా ఈ సినిమా చూడలేదు. ఈ చిత్రం వల్ల రాధిక, శరత్ భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు.

This post was last modified on April 11, 2026 4:03 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago