Movie News

హీరో ఊర మాస్.. హీరోయిన్ పక్కా క్లాస్

కెరీర్లో చాలా ఏళ్ల పాటు పక్కింటి అబ్బాయి పాత్రలే చేస్తూ వచ్చిన నేచురల్ స్టార్ నాని.. కొన్నేళ్ల ముందు ‘దసరా’ సినిమాతో ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు. అతను అలాంటి ఊర మాస్ అవతారంలోకి మారడం అదే తొలిసారి. ముందు ఆ లుక్ చూసి జనం భయపడ్డారు. కానీ సినిమా చూసినపుడు అలవాటు పడ్డారు. ఆ చిత్రానికి మంచి విజయాన్ని కూడా కట్టబెట్టారు.

ఆ సినిమా ఇచ్చిన భరోసాతో దాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న కొత్త చిత్రంలో మరింత షాకింగ్ అవతారంలోకి మారాడు నాని. ‘ది ప్యారడైజ్’లో నాని లుక్ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత షాకింగ్ హీరో లుక్స్‌లో ఇదొకటి. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రోమోల్లోనూ నాని ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు. కానీ ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తున్న కాయదు లోహర్ మాత్రం పక్కా క్లాస్‌గా కనిపించబోతోంది. ఆమె లుక్‌ను తాజాగా సోషల్ మీడియాలో లాంచ్ చేసింది చిత్ర బృందం.

వింటేజ్ విదేశీ అమ్మాయిల్లాగా కాయదు డిఫరెంట్ అవతారంలో కనిపించబోతోంది. అంత ఊర మాస్‌గా ఉన్న నాని పక్కన.. ఇంత క్లాస్‌గా కనిపించే హీరోయిన్ ఏంటి అనిపించేలా ఉంది తన లుక్. గతంలో తమిళ కల్ట్ మూవీ ‘ఆడుగళం’లో హీరో ధనుష్ ఇలాగే చాలా మాస్‌గా కనిపిస్తే.. తన పక్కన తాప్సి పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించింది. అలాంటి కాంట్రాస్ట్ లుక్స్‌లోనే నాని, కాయదులను చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల.

ఈ చిత్రంలో కాయదు కథానాయిక అని ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు. నేరుగా తన పుట్టిన రోజు నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తోనే ఆమె హీరోయిన్ అనే విషయం అఫీషియల్‌గా వెల్లడైంది. ఈ చిత్రంలో లెజెండరీ నటుడు మోహన్ బాబు విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి చివరి వారంలో రావాల్సిన ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ‘దసరా’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

This post was last modified on April 11, 2026 4:07 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago