ఒక భాష నుంచి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వస్తే.. ఆ భాషకు సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీ గర్వంతో తలెత్తుకుంటుంది. ‘బాహుబలి’ సినిమా వచ్చినపుడు తెలుగు సినీ పరిశ్రమ ఎంత గర్వించిందో తెెలిసిందే. కానీ బాలీవుడ్ మాత్రం ‘దురంధర్’ సినిమా విషయంలో ఎంతమాత్రం ప్రౌడ్‌గా ఫీలవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత ఏడాది డిసెంబరులో ‘దురంధర్’ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసినపుడు కానీ.. గత నెలలో ‘దురంధర్-2’ విడుదలై అంతకుమించిన ప్రభంజనం రేపినపుడు కానీ.. బాలీవుడ్ ప్రముఖులు పెద్దగా స్పందించింది లేదు.
హృతిక్ రోషన్ మినహాయిస్తే.. ‘దురంధర్’ రిలీజైనపుడు బాలీవుడ్ నుంచి ఈ సినిమాను కొనియాడుతూ సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్లు లేరు. హృతిక్ సైతం ఈ సినిమాను పొగుడుతూనే.. కౌంటర్లు వేశాడు. ఇక ‘దురంధర్-2’ విడుదల సమయంలో ఈ మాత్రం స్పందన కూడా లేదు. సౌత్ నుంచి రాజమౌళి, మహేష్ బాబు, అల్లు అర్జున్ సహా ఎంతోమంది ఈ సినిమాను ఆకాశినికెత్తేశారు.
తాజాగా సందీప్ రెడ్డి వంగ ‘దురంధర్-2’ గురించి పెట్టిన పోస్టు.. దానికి దర్శకుడు ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్‌గా మారాయి. ‘దురంధర్’, ‘దురంధర్-2’ చిత్రాలను ప్రాపగండా ఫిలిమ్స్ అంటూ ముద్ర వేసి మౌనం వహిస్తున్న బాలీవుడ్ ప్రముఖులందరికీ సందీప్ రెడ్డి మామూలు కౌంటర్ ఇవ్వలేదు.
సందీప్ అంటే ముందు నుంచి బాలీవుడ్ జనాలకు నచ్చదు. కబీర్ సింగ్, యానిమల్ సినిమాలను అక్కడి వాళ్లు ఓన్ చేసుకోలేదు. కానీ ఆ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్లు కొట్టాడు సందీప్. ఈ సినిమాలను డీగ్రేడ్ చేయాలిన చూసిన ఫిలిం క్రిటిక్స్‌ను సందీప్ ఎలా ఆటాడుకున్నాడో తెలిసిందే.
ఆదిత్య ధర్ సినిమాలను సైతం ఇలాగే ఫిలిం క్రిటిక్స్ టార్గెట్ చేశారు. వాళ్లకు తన సినిమా బాక్సాఫీస్ ఫలితంతోనే జవాబు చెప్పాడు ఆదిత్య. ఈ ఇద్దరు దర్శకుల సక్సెస్‌ను చూసి బాలీవుడ్ ఓర్చుకోలేకపోతోందన్నది స్పష్టం. వాళ్లు భారీ విజయాలు అందుకోవడమే కాదు.. బాలీవుడ్ లిబరల్ బ్యాచ్‌కు ఇచ్చిన కౌంటర్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నో ఏళ్లుగా ఒకే రకం సినిమాలు తీస్తూ.. తమకు నచ్చిన తరహాలో ప్రాపగండా చేస్తున్న వాళ్లకు నిన్న సందీప్-ఆదిత్య ఇచ్చిన కౌంటర్ల విషయంలో సోషల్ మీడియా నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మెజారిటీ జనం వారి వైపే ఉన్నారన్నది స్పష్టం. ఈ పరిస్థితి చూసి బాలీవుడ్ కుతకుతలాడిపోతూ ఉంటుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates